kumaram bheem asifabad- సన్న బియ్యం పక్కదారి
ABN , Publish Date - Aug 02 , 2026 | 10:08 PM
జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని సైతం అక్రమార్కులు వదలం లేదు. గతంలో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ఇచ్చేవారు. లబ్ధిదారులు వాటిని తినలేక వ్యాపారులకు విక్ర ుుంచే వారు. కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులు బియ్యం తీసుకుంటున్నారు. సన్న బియ్యం పంపిణీ ప్రారంభంలో లబ్ధిదారులు వాటిని తినడానికి వినియోగించారు
- సరిహద్దులు దాటించేస్తున్న అక్రమార్కులు
ఆసిఫాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని సైతం అక్రమార్కులు వదలం లేదు. గతంలో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ఇచ్చేవారు. లబ్ధిదారులు వాటిని తినలేక వ్యాపారులకు విక్ర ుుంచే వారు. కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులు బియ్యం తీసుకుంటున్నారు. సన్న బియ్యం పంపిణీ ప్రారంభంలో లబ్ధిదారులు వాటిని తినడానికి వినియోగించారు. ఇటీవల కాలంలో మళ్లీ అక్రమార ్కులకు విక్రయిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి ఇతర రాష్ర్టాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లబ్ధిదారుల నుంచి పలువురు అక్రమార్కులు రాయితీ బియ్యం కొనుగోలు చేస్తూ మహారాష్ట్రకు తరలిస్తున్నా రు. బహిరంగాగానే ఆటోలు, ద్విచక్రవాహనాలపై తరలిస్తున్నా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మాత్రం నామమాత్రంగా దాడులు చేపడుతున్నారు. దీంతో ఈ అక్రమ వ్యాపారానికి తెరపడడం లేదు. పేదల ఆకలి తీర్చాల్సిన బియ్యాన్ని జిల్లాలోని కొందరు అక్రమార్కు లు అడ్డదారిలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం అందిస్తున్న రాయితీ బియ్యం కొంతమంది వ్యాపారులకు కాసులు కూడబెడుతోంది. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని కొందరు తినలేక మార్కెట్‌లో విక్రయిం చేవారు. సన్నరకం బియ్యం ఇవ్వడం ప్రారంభించాక కొన్ని రోజులు ఈ ప్యాపారం తగ్గిపోయిది. కానీ ఇటీవల కాలంలో మళ్లీ అక్రమ వ్యాపారం జోరందుకుంది. అధికారుల తనిఖీల్లో పట్టుబడి కేసు లు నమోదైనా అక్రమార్కులు తగ్గడం లేదు. వీరికి కొందరు రేషన్ డీలర్లు సైతం సహక రిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి కిలో రూ.14 నుంచి 18 వరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని అక్రమంగా వాహనాల్లో మహారాష్ట్రకు తరలించి కిలో రూ. 30 నుంచి 35కు విక్రయిస్తున్నారు. పలు కాలనీలు, ఇళ్లలో కొనుగోలు చేసిన బియ్యాన్ని గుట్టుగా దాచి రాత్రివేళల్లో వాహ నాల్లో లోడ్ చేసు కొని తరలిస్తున్నారు. ప్రతి నెలా అధికారులు రేషన్ దుకానాలను తనిఖీ చేయాల్సి ఉంది. కానీ ఇటీవల తనిఖీలు చేయడం లేదని చెబుతున్నారు.
- జిల్లాలో 1,39,773 కార్డుదారులు..
జిల్లాలో మొత్తం 300 రేషన్ దుకాణాల పరిధిలో 1,39,773 కార్డుదారులు ఉన్నారు. ప్రతి నెలా కార్డుదారులకు 4,570 మెట్రిక్ టన్నుల క్వింటాళ్ల సన్నబియ్యం ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జిల్లాలో నిత్యం బియ్యం దందా కొనసాగుతూ ఏదో ఒక చోట పట్టుబడుతున్నా రేషన్ బియ్యం అక్రమ రవా ణా మాత్రం ఆగడం లేదు. కాగజ్‌నగర్ మండలం లోని భట్టుపల్లి వద్ద ఈ నెల 7న ఆటోలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. చుట్టు పక్కల గ్రామాల లబ్దిదారుల నుంచి వీటిని సేకరించి మహారాష్ట్రకు తరలిస్తున్నా రని అధికారులు గుర్తించారు. 10 బస్తాలలో సమా రు 4.97 కింటాళ్ళ బియ్యంతో కూడిన ఆటోను సీజ్ చేశారు. ఈ నెల 10న కాగజ్‌నగర్ మండలంలోని డాడానగర్ ఏరియాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు. రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 11.20 క్వింటాళ్ల బియ్యంతో పాటు ఆటోలను సీజ్ చేసి నిందితులపై 6ఏ కేసు నమోదు చేశారు సిర్పూర్ మండలం టోంకిని వద్ద ఈనెల 12న మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికా రుు పట్టుకున్నా రు. 15 బస్తాల్లో సుమారు 6.20 కింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకొని ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
- కఠిన చర్యలు తీసుకుంటేనే..
సన్న బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫ రాల శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్ప టికే అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడమే కాక లబ్ధిదారులు బియ్యాన్ని అమ్ముకున్నట్లు తెలిస్తే కేసు నమోదు చేయడమే కాక రేషన్ కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. బియ్యం అమ్మిన, కొను గోలు చేసిన వారిపై కేసులు పెడుతామని చెబుతు న్నారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. కానీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే తనిఖీలు ముమ్మరం చేయడంతోపాటు రేషన్ దుకాణాలపై పైన సైతం నిఘా పెట్టాలని పలువురు సూచిస్తు న్నారు. కానీ ప్రభుత్వం, అధికారుల అంచనాలను తల కిందులు చేస్తూ కొందరు వ్యాపారులు సన్నబియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యంతో లక్షలు కొల్లుగొట్టిన వ్యాపారులు ఇప్పుడు సన్నబియ్యం కావడంతో ప్రణాళికతో పక్క దారి పట్టిస్తున్నారు. దొడ్డు బియ్యం కన్నా ఎక్కువ డబ్బులు ముట్ట చెబు తుండడంతో లబ్ధిదారులు అమ్ముకుంటున్నట్లు చెబు తున్నారు. అధికారులు మహారాష్ట్ర సరిహద్దు ప్రాం తాల్లో నిరంతరం తనిఖీలు చేపట్టం ద్వారా బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.