Share News

kumaram bheem asifabad-మౌలిక వసతుల కల్పనకే జిల్లాలు ఏర్పాటు

ABN , Publish Date - Oct 11 , 2026 | 10:32 PM

మౌలిక వసతుల కల్పనకే బీఆర్‌ఎస్‌ అధినేత జిల్లాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు.

kumaram bheem asifabad-మౌలిక వసతుల కల్పనకే జిల్లాలు ఏర్పాటు
:కేసీఆర్‌ ఫ్లెక్సికీ క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నాయకులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మౌలిక వసతుల కల్పనకే బీఆర్‌ఎస్‌ అధినేత జిల్లాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రదాన వీదుల గుండా బైక్‌ర్యాలీ చేపట్టారు. అనంతరం కుమరం భీం చౌక్‌లోని కుమరంభీం విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫెక్మీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటు కేవలం పరిపాలన పునర్వీవ్యవస్థీకరణకు మాత్రమే కాదని ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం, మౌలిక వసతులను ప్రజలకు చేరువ చేసే ప్రక్రియలో భాగమని అనాడు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చెప్పారని అదినేడు నిజమైందన్నారు. కేసీఆర్‌ హయంలోనే జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని చెప్పారు. మెడికల్‌ కళాశాల, సమీకృత కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రులు, రోడ్లు, తదితర రంగాలలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు కోవ సాయినాథ్‌, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఆకాష్‌, అహ్మద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు చిలూవేరి వెంకన్న, బాలకృష్ణ, సాలం, సర్పంచ్‌ బుర్స పోచయ్య, నాయకులు నిసార్‌, అన్సార్‌, సిహెచ్‌ రవి, జీవన్‌, శ్యాం, ఆహ్మద్‌, అమర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 10:32 PM