Share News

22న జిల్లా స్థాయి ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక సభ

ABN , Publish Date - May 19 , 2026 | 01:03 AM

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 22వ తేదీన శుక్రవారం జిల్లా స్థాయి సభ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

22న జిల్లా స్థాయి ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక సభ
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

సిరిసిల్ల, మే 18 (ఆంరఽధజ్యోతి): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నెల 22వ తేదీన శుక్రవారం జిల్లా స్థాయి సభ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. సోమవారం జిల్లా కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సభలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరు గ్యారంటీలు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలతో కరపత్రం రూపొందించాలని, దానిని కార్యక్ర మంలో అందజేయాలని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, రైతులు, వివిధ పథకాల లబ్ధిదారులను ఆహ్వానించాలని ఆదేశించారు. సభలో తెలంగాణ రాష్ట్ర గీతం స్వాగతోపన్యాసం, పరిచయం అలాగే సీఎం సందేశం వినిపించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలు, లబ్ధిదారుల వివరాలపై శాఖల ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. లబ్ధిదారుల పేర్లను చదవాలని, లబ్ధిదారుల అభిప్రాయాలు, అనుభవాలు చెప్పాలని తెలిపారు. ఇప్పటి దాకా అమలు చేస్తున్న వాటిపై చర్చించాలని, భవిష్యత్‌లో చేపట్టనున్న పనులపై తీర్మానాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాజేందర్‌ రెడ్డి, కేఎస్‌ బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సీపీఓ శ్రీనివాసాచారి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు వాహనాల సంఖ్య పెంచాలి

ధాన్యం లారీల ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు వాహనాల సంఖ్య మరింత పెంచాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు అనుగుణంగా వాహనాలు సమకూర్చాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రైస్‌ మిల్లర్లు, లారీల ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లతో ఎస్పీ మహేష్‌ బి గితే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా రైస్‌ మిల్లులు, గోదాముల్లో ధాన్యం అన్‌ లోడింగ్‌, కొనుగోలు కేంద్రాలకు వాహనాల తరలింపుపై ఆరా తీశారు. రైస్‌ మిల్లర్లు తమ మిల్లుల్లో హమాలీల సంఖ్య పెంచాలని ఆదేశించారు. అన్‌ లోడింగ్‌లో వేగం పెంచి వాహనాలను కొనుగోలు కేంద్రాలకు పంపాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీసీఎస్‌ఓ బుచ్చిబాబు, మేనేజర్‌ నరసింహ, డీసీఓ రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు, డీటీసీపీఓ అన్సార్‌, రవాణా శాఖ అధికారి, రైస్‌ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 01:03 AM