Share News

రాజీమార్గం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలి

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:29 PM

రాజీ మార్గమే రాచమార్గమ ని లోక్‌ అదాలత్‌ ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యలను ముగిం చుకోవాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు.

రాజీమార్గం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలి
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా

సీపీ అంబర్‌కిషోర్‌ఝా

మంచిర్యాల, జూన్‌15 (ఆంధ్రజ్యోతి): రాజీ మార్గమే రాచమార్గమ ని లోక్‌ అదాలత్‌ ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యలను ముగిం చుకోవాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. ఈ నెల 20 శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రజలు స ద్వినియోగం చేసుకోవాలని తమ న్యాయ సంబంధిత సమస్యలను త్వ రితగతిన పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజీకి అను వైన క్రిమినల్‌ కాంపౌండవుల్‌ కేసులు, సివిల్‌ వివాదాలు, ఆస్తి విభ జన, కుటుంబ, వైవాహిక కేసులు బ్యాంక్‌ బకాయిల వసూళ్లు విద్యు త్‌ చౌర్యం చెక్‌బౌన్స్‌ కేసుల్లో ఇరు పక్షాలు పరస్సరం చర్చించుకొని లోక్‌అదాలత్‌ద్వారా రాజీకీ రావాలని కోరారు. చిన్న చిన్న వివాదాల కా రణంగా కోర్టుల చుట్టు తిరుగుతూ ఽసమయం, ధనంవృధా చేసుకో కుండా న్యాయశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని శాంతి యుత పరిష్కారం పొందాలని సూచించారు. కమిషనరేట్‌ పరి ధిలో సిబ్బందికి తగిన మార్గదర్శకాలు అందించారు. ఇరువర్గాల వారి ని పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించి రాజీ కుదిరేలా కృషి చేయాలని సూచించారు. రాజీ కావాలని కోరుకునే వ్యక్తులు సంబంధిత పోలీసు అధికా రులను సంప్రదించాలని అన్నారు.

బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్టప్ర కారం వాటిని వేగవంతంగా పరిష్కరించాలని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ఝా ఆదేశించారు. సోమవారం పోలీసు కమి షనరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో భా గంగా ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అందిన ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ జరిపి ప్రజలకు బాధి తులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు మరింత చేరు వయ్యే లక్ష్యంతో శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్‌ నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 11:30 PM