Share News

kumaram bheem asifabad- సర్‌సిల్క్‌ మిల్లు భూముల వివాదం

ABN , Publish Date - Nov 22 , 2026 | 09:56 PM

కాగజ్‌నగర్‌ పట్టణంతో పాటు మండలంలోని కోసిని, చింతగూడ గ్రామాల పరిధిలో ఉన్న సర్‌సిల్క్‌ లిమిటేడ్‌ కంపెనీకి చెందిన భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. చింతగూడ, కోసిని, సర్‌సిల్క్‌ ఎఫ్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మందికి రెవెన్యూశాఖ ఆధ్వర్యం లో ఎవిక్షన్‌ నోటీసులు జారీ చేయడం చర్చనీ యాంశంగా మారింది.

kumaram bheem asifabad- సర్‌సిల్క్‌ మిల్లు భూముల వివాదం
లోగో

- అండగా ఉంటామని రాజకీయ నాయకుల హామీ

కాగజ్‌నగర్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ పట్టణంతో పాటు మండలంలోని కోసిని, చింతగూడ గ్రామాల పరిధిలో ఉన్న సర్‌సిల్క్‌ లిమిటేడ్‌ కంపెనీకి చెందిన భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. చింతగూడ, కోసిని, సర్‌సిల్క్‌ ఎఫ్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మందికి రెవెన్యూశాఖ ఆధ్వర్యం లో ఎవిక్షన్‌ నోటీసులు జారీ చేయడం చర్చనీ యాంశంగా మారింది. ఆరు నెలల క్రితం మిల్లు స్థలాల్లోఅక్రమంగా మిల్లు స్థలా లను కబ్జా చేసి నివాస గృహాలు, వాణిజ్య సంస్థలను నిర్మించారు. సర్‌సిల్క్‌ మిల్లు మూత పడడంతో కార్మికులంతా కలిసి 2000లో సంవత్సరంలో హైకోర్టు ను ఆశ్రయించారు. హైకోర్టు లిక్విడేటర్‌ను నియమించి మిల్లు స్థలాలను అమ్మి కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించింది. ఈ ప్రక్రియలో రెండు దఫాలుగా కార్మికులకు సెటిల్‌ మెంటు చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ మిల్లు స్థలాన్ని కొనుగోలు టెండర్‌లో కొనుగోలు చేసిన బిడ్డర్‌ తమ దక్కిన భూముల్లో ఏకంగా అక్రమ కబ్జాలు వెలిశాయని తమకు వెంట నే న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. మిల్లు స్థలాల్లో అక్రమణలు చేసిన వారికి నోటీసులు పంపించాలని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఆఽధారంగా మిల్లు స్తలాల్లో నివసి స్తున్న సుమారు మూడు వేల మందికి నోటీసుల ప్రక్రియను రెవెన్యూ అధికారులు జీరా చేశారు. ఈ నోటీసులతో ఇప్పుడు కబ్జాలో ఉన్న వారంత ఏం చే యాలో తెలియక భయాందోళనకు గురవుతున్నారు.

- వేడెక్కిన రాజకీయం..

మిల్లు స్థలాల్లో ఆక్రమణలు చేసిన వారికి నోటీసులు అందడంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు దీనిపై స్పందించడంతో పరిస్థతి వేడె క్కింది. మిల్లు స్థలాల్లో నివసిస్తున్న వారికి నోటీసు లు రావడంతో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ గత వారం రోజుల క్రితం లిక్విడేటర్‌ను కలిసి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కౌన్సిలర్లతో కలిసి వినతి పత్రం అందజేశారు. నాలుగు రోజులు క్రితం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సర్‌సిల్క్‌ మిల్లు కార్మికులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా మాజీ మంత్రి చేసిన ప్రకటన ఒక్కసారిగా దూమారం రేగింది. ఇక్కడి ఎమ్మెల్సే దండే విఠల్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు కలిసి సర్‌సిల్క్‌ మిల్లు ఖాళీ స్థలాలను కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతు న్నారని చెప్పారు. ఈ కుట్రతోనే అందరికి నోటీసులు వచ్చాయని పేర్కొనడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ చర్చ జరుగుతోంది. కార్మికు లకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని, పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ అండగా ఉంటారని స్పష్ట మైన హామీ ఇచ్చారు.

- మిల్లు స్థలాల్లో..

మిల్లు స్థలాల్లో ఉంటున్న వారికి రెవెన్యూ అధికా రులు అందజేశారు. ఇందులో భాగంగా సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయిహరీష్‌ బాబుకు కూడా నోటీసులు అందించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీ యాంశంగా మారింది. మిల్లు స్థలాలను 8 లాట్‌ లుగా విభజించి ఒకటో లాట్‌లో 69.93 ఎకరాలు, రెండో లాట్‌లో 3.89 ఎకరాలు, మూడో లాట్‌లో 11.37 ఎకరాలు, నాలుగులో లాట్‌లో 69.33 ఎకరా లు(ఫ్యాక్టరీ స్థలం), ఐదో లాట్‌లో 34.63 ఎకరాలు, ఆరో లాట్‌లో 187.39 ఎకరాలు, ఏడో లాట్‌లో 50.29 ఎకరాలు, ఎనిమిదో లాట్‌లో 91.21 ఎకరాలు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో 200 ఎకరాలు భూమిని బిడ్డర్లు కొనుగోలు చేశారు. కొను గోలు చేసే సమయంలో ఖాళీ స్థలాలుగా ఉన్నట్టు అధికారులు హైకోర్టుకు చూపారు. కొనుగోలు చేసిన బిడ్డర్లకు స్థలాలను చూసేందుకు వచ్చారు. తమకు అప్పజెప్పిన భూముల్లో అక్రమంగా కబ్జాలు చేశారని, ఖాళీ చేసి ఇవ్వాలని పలు మార్లు రెవె న్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా స్పందన రాక పోవడంతో సంబంఽధిత బిడ్డర్‌ నేరుగా హైకోర్టును మళ్లీ ఆశ్రయిం చారు. దీంతో హైకోర్టు మిల్లు స్థలాల్లో నివసిస్తున్న వారందరికి నోటీసులు జారీ చేసి ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేయడంతో నోటీసులను అందజేశారు. కాగా గతం లో మిల్లు క్వార్టర్లను కూడా లిక్విడేటర్‌ వద్ద కొను గోలు చేసుకున్న వారికీ నోటీసులు వచ్చాయి.

నోటీసుదారులు ఆందోళన చెందొద్దు..

- పాల్వాయి హరీష్‌బాబు, సిర్పూరు ఎమ్మెల్యే

నోటీసుదారులు ఆందోళన చెందకూడదు. మిల్లు స్థలాల్లో నివసిస్తున్న వారు అధైర్యపడాల్సిన అవస రం లేదు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరి ష్కరించేందుకు కృషి చేస్తాం.

లిక్వేడర్‌కు సమస్యను వివరించాం..

- దండే విఠల్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ

ఇక్కడున్న పరిస్థితులను ఇటీవల లిక్విడేటర్‌ను కలిసి వివరించాం. నోటీసుదారులు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. సమస్య కు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

కార్మికులకు అన్యాయం జరగనివ్వం..

- కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్యే

కార్మికులకు అన్యాయం జరగనివ్వం. నేను కూ డా సర్‌సిల్క్‌ కార్మికుడిను. వారి కష్టాలు తెలుసు. కార్మికులకు న్యాయం చేసేందుకు బీఆర్‌ఎస్‌ వర్కిం గ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ లీగల్‌ టీం ఏర్పాటు చేశారు.

Updated Date - Nov 22 , 2026 | 09:56 PM