kumaram bheem asifabad- అస్తవ్యస్తంగా మురుగు కాలువలు
ABN , Publish Date - Jun 24 , 2026 | 10:34 PM
మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో మురుగు కాలువలు అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలువలు సకాలంలో శుభ్రం చేయపోవడం, ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగునీటి దుర్వాసన వెదజల్లుతోంది. కాలనీలోని 6వ, 7వ వార్డులో మురుగుకాలువ నుంచి నీరు బయ టకి వెళ్లడానికి దారి లేక డ్రైనేజీలు నిండి మురుగునీరు ఇళ్ల అవరసణలో చేరుతుండడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.
వాంకిడి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో మురుగు కాలువలు అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలువలు సకాలంలో శుభ్రం చేయపోవడం, ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగునీటి దుర్వాసన వెదజల్లుతోంది. కాలనీలోని 6వ, 7వ వార్డులో మురుగుకాలువ నుంచి నీరు బయ టకి వెళ్లడానికి దారి లేక డ్రైనేజీలు నిండి మురుగునీరు ఇళ్ల అవరసణలో చేరుతుండడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. రోజుల తరబడి మురికి నీరు ఇంటి ఆవరణలో ఉండడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. వర్షాలు కురిసినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతోంని మురుగునీరు గుమ్మాల దాకా చేరడంతో దోమలు పెరిగి పురుగులు ఇళ్లలోకి చేరుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమలు విపరీతంగా పెరిగి జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని కాలనీవాసు లు వాపోతున్నారు. మురుగుకాలువలను మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు పంచాయతీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా ఎలాంటి స్పందన లేదని ప్రజలు ఆరోపి స్తున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కాలువలను శుభ్రం చేసి మురుగునీరు నిలిచి ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు