Share News

పరిసరాల పరిశుభ్రతతోనే రోగాల నియంత్రణ

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:02 PM

పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవడం వల్లనే రోగాలను నియంత్రించుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, జిల్లా వైద్యాధికారి నరేందర్‌ రాథోడ్‌ అన్నారు.

పరిసరాల పరిశుభ్రతతోనే రోగాల నియంత్రణ

అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, డీఎంహెచ్‌వో నరేందర్‌

కాసిపేట, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవడం వల్లనే రోగాలను నియంత్రించుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, జిల్లా వైద్యాధికారి నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. గురువారం మం డలంలోని వెంకటాపూర్‌ పీవీటీజీ ఎంపీసీ భవనంలో ఆయన మాట్లాడు తూ వర్షాకాలం సీజన్‌లో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంద ని, ప్రతీ ఒక్కరు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించా లన్నారు. ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఆదిమ గిరిజన జాతుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌ ష్టికాహారం సక్రమంగా అందించాలని, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పీవీటీజీ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్ప నపై అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసనా సామర్థ్యాలను పరిశీలించారు. వెంక టాపూర్‌ సర్పంచు పెంద్రం శంకర్‌, ఉపసర్పంచు ప్రసన్న, ఎంపీడీవో సత్య నారాయణసింగ్‌, ఎంపీవో సప్దర్‌ ఆలీ, డిప్యూటి డీఎంహెచ్‌వో సుధాకర్‌ నా యక్‌, కాసిపేట మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీదివ్య, మాస్‌ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్‌, పుట్ట సత్తయ్య, పంచాయతీ కార్యదర్శి సునీత, ఏఎన్‌ఎం సుజా త, లక్ష్మీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 11:02 PM