Share News

విపత్తుల నిర్వహణలో సమయోచిత స్పందన కీలకం

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:14 AM

విపత్తుల వేళ.. సమయోచిత స్పందన, తగిన రీతిలో సమన్వయం, మెరుగైన రీతిలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటివి అత్యంత కీలకమని గవర్నర్‌ కార్యాలయ ...

విపత్తుల నిర్వహణలో సమయోచిత స్పందన కీలకం

  • యువ ఆపదమిత్ర శిక్షణలో దానకిశోర్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 1(ఆంధ్రజ్యోతి) : విపత్తుల వేళ.. సమయోచిత స్పందన, తగిన రీతిలో సమన్వయం, మెరుగైన రీతిలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటివి అత్యంత కీలకమని గవర్నర్‌ కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి దానకిశోర్‌ పేర్కొన్నారు. ఆదివారం ఉస్మానియా వర్శిటీలో యువఆపదమిత్ర పథకంలో భాగంగా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఫైర్‌సేఫ్టీ విభాగంతో కలిసి నల్గొండ జిల్లాకు చెందిన 120 మంది ఎన్‌ఎ్‌సఎస్‌ వలంటీర్లకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అమలు చేస్తోన్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలు ప్రజలకు సేవలనందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. భవిష్యత్‌ శిక్షణ కార్యక్రమాలను యువ ఆపద మిత్ర, ఎన్‌ఎ్‌సఎస్‌, రెడ్‌క్రాస్‌ సంయుక్తంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన యువతతో జిల్లాల్లో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తామన్నారు. ఉస్మానియా వర్శిటీలోని రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌స్టడీస్‌ డైరెక్టర్‌ శ్రీనాగేష్‌ మాట్లాడు తూ ప్రాఽథమిక రక్షణ నైపుణ్యాలపై అవగాహన కల్పించనున్నామన్నారు. సహనోడల్‌ అధికారులు వెంకటేశ్వర్లు, విజయఉష పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 02:14 AM