Share News

kumaram bheem asifabad- వృద్ధులకు నిరాశ

ABN , Publish Date - Aug 08 , 2026 | 10:56 PM

చేయూత పింఛన్‌ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభు త్వం విడుదల చేసిన ఫారంలో వృద్ధుల కాలం లేక పోవడంతో నిరాశ చెందతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా పింఛన్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. వివిధ వర్గాలకు ఇవ్వడానికి అను మతి ఇస్తూ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం నూతన ఫారం విడుదల చేసింది. కానీ వృద్ధాప్య పెన్షన్‌దారులకు మొండిచే యి చూపే అవకాశం కనిపిస్తోంది.

kumaram bheem asifabad- వృద్ధులకు నిరాశ
లోగో

- వృద్ధాప్య కాలం లేకుండా విడుదల చేసిన ప్రభుత్వం

- దరఖాస్తుల స్వీకరణ బాధ్యత పంచాయతీ కార్యదర్శి, బిల్‌ కలెక్టర్లదే

- మార్గదర్శకాల్లో కీలక అంశాలు వెల్లడి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): చేయూత పింఛన్‌ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభు త్వం విడుదల చేసిన ఫారంలో వృద్ధుల కాలం లేక పోవడంతో నిరాశ చెందతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం ద్వారా పింఛన్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. వివిధ వర్గాలకు ఇవ్వడానికి అను మతి ఇస్తూ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం నూతన ఫారం విడుదల చేసింది. కానీ వృద్ధాప్య పెన్షన్‌దారులకు మొండిచే యి చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫారంలో ఎక్కడ కూడా వృద్ధాప్య పింఛన్ల కాలం లేకపోవడమే ఇందుకు కారణం. వితంతువులు, దివ్యాంగ, ఒంటరి మహిళ లు, గీత, చేనేత ఇతరత్రా కాలాలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఎన్నో రోజుల నుంచి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులకు నిరాశే మిగిలినట్లయింది. కాగా ఇతర వర్గాల వారు మా త్రం అనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్‌ లబ్ధిదారుల ప్రత్యక్ష ధ్రువీకరణ ద్వారా బోగస్‌ పెన్సన్లను ఏరివేసిన స్థానంలో ఆ సంఖ్యకు అనుగుణంగా కొత్త పెన్షన్లుఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వారిదే బాధ్యత:

ప్రభుత్వం నూతన పింఛన్ల దరఖాస్తు కోసం ఫారం విడుదల చేసింది. చేయూత పథకం పేరిట విడుదల చేసిన ఫారం నమూనాను ఎంపీడీవో గ్రామకార్యదర్శి ఇతర శాఖల అధికారులకు పంపిం చారు. అందులో స్పష్టంగా వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులతో పాటు పైలేరియా, డయాలసిస్‌ వారికి మాత్రమే అని పేర్కొన్నారు. ఎక్కడా వృద్ధాప్య అని లేకపోవ డంతో వారు నమోదు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దరఖాస్తు ఫారాలను గ్రామ కార్యదర్శితో పాటు బిల్‌ కలెక్టర్లు తీసుకోవాలి. ఆ తర్వాత రూరల్‌ ఏరియాలో ఎంపీడీవోలు, అర్బన్‌ ఏరియాలో మున్సిపల్‌ కమిషనర్లు పరిశీలించి ధ్రువీ కరించేలా పొందుపరిచారు. పైలేరియా పేషెంట్లకు జిల్లా మలేరియా అధికారి, డయాలసిస్‌ బాధితు లకు ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ జిల్లా కోఅర్డినేటర్‌ ధృవీకరించాలని నిబంధనలో పేర్కొన్నారు.

జత పర్యాల్సినవి ఇలా..

పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఫారం నింపడంతో పాటు వితంతువులు భర్త చనిపోయిన ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలు పెళ్లి కాలే దని, ఒంటరిగా ఉన్నట్లుఽ దృవీకరణ పత్రం, దివ్యాం గులు యూడీఐడీ సర్టిఫికెట్‌, గీత కార్మికులు సొసై టీలో సభ్యుడిగా ఉన్న పత్రం, చేనేత కార్మికులు టెక్స్‌టైల్స్‌ డిపార్టుమెంట్‌ ధ్రువీకరణ పత్రం జతపరచాల్సి ఉంటుంది. కాగా కొత్త పింఛన్ల కోసం ఎక్కువగా ఎదురుచూసేది వృద్ధులే. గ్రామాలకు నా యకులు, అధికారులు ఎవరు వచ్చినా వారి వద్దకు వచ్చి పింఛన్‌ఇవ్వండి అంటూ వేడుకుంటారు. ప్రభుత్వమేమో అధికంగా వృద్ధాప్య పింఛన్‌దారులు ఉంటారని, ప్రస్తుతం తక్కువగా ఉంటే లబ్ధిదా రులను ఎంచుకుంటే ప్రభుత్వంపై భారం ఉండదని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వృద్ధా ప్య పింఛన్లు అయితే వయస్సు 57 ఏళ్లు నిండిన వారికి ఇవ్వాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం ఈ వయస్సు వారికి ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్‌పార్టీ సైతం ఎన్నికల సమయంలో వారికే ఇస్తామని ప్రచారం చేసింది. దీంతో ఈ వయస్సు వారికి ఇవ్వాలంటే గ్రామానికి సుమారు 10 నుంచి 100 మంది వరకు లబ్ధిదారులు ఉంటారు. వీరం దరికి ఇస్తే ఆధిక బారం అవుతుందని బావిస్తున్న ట్లు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వృద్ధులు నిరాశ చెందుతున్నారు.

అవకాశం కల్పించాలి..

- నల్లగొండ శేఖర్‌, ఈదులవాడ

ప్రభుత్వం వృద్ధులకు అవకాశం కల్పించాలి. ఎన్నో రోజుల నుంచి పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నాం. అప్పుడు, ఇప్పుడని చెబుతున్నా ఎవరు ఇవ్వడంలేదు. తీరా ఇప్పుడేమో వృద్ధులకు తర్వాత ఇస్తామంటున్నారు. మాకు అన్యాయం చేయద్దు. ప్రభుత్వం ఇప్పటికైనా చేయూత పింఛన్‌లో మాకు అవకాశం కల్పించాలి.

Updated Date - Aug 08 , 2026 | 10:56 PM