డిండికి నీళ్లు ఎక్కడి నుంచి తరలిద్దాం?
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:05 AM
డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుంచి నీళ్లు తరలించాలనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఈ నెల 14న నిర్ణయం తీసుకోనున్న సీఎం
డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుంచి నీళ్లు తరలించాలనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి సైతం నీటిని తరలించడానికి అనుమతిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీవో జారీ చేసింది. అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలని అప్పట్లో నిర్ణయించింది. అయితే, దీనిపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత వచ్చింది. సోమవారం జరిగిన సమావేశంలోనూ అదే తీరులో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 14న కీలక సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. డిండితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులకు వెచ్చించిన వ్యయం ఎంత? ఏ మేరకు నీరు అందుతుంది? ఇంకెన్ని నిధులు కావాలి? వంటి వివరాలతో హాజరుకావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు.