kumaram bheem asifabad- జిల్లాలో 83.68 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి
ABN , Publish Date - Jul 21 , 2026 | 10:34 PM
జిల్లాలో 83.68 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్ హరిత అన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మంగళవారం రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు.
ఆసిఫాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 83.68 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్ హరిత అన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మంగళవారం రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. ఇంకా కొన్ని జిల్లాలలో 50 శాతం కూడా డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని చెప్పారు. మృతి చెందిన, గ్రామం వదిలి వెళ్లిన, రెండు చోట్ల ఓటరు జాబితాలో ఉన్నవారి వివరాల జాబితాను రుపొందించాలని తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల రేషలైజేషన్ ఎస్‌ఎస్‌బీ జాబితా సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ జిల్లాలో 83.68 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని వివరించారు. ఈనెల 25లోగా 100 శాతం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో వేణు తదితరులు పాల్గొన్నారు.
సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
సాదాబైనామా, భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌టో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవో, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాదాబైనామాల క్రమబద్ధీకరణ కింద దరఖాస్తు చేసుకున్న వాటిని రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని తెలిపారు. దరఖాస్తులు చాలా మండలాల్లో ఇంకా పెండింగ్ దశలో ఉన్నాయని చెప్పారు. తిరస్కరించే దరఖాస్తుల కారణాలు నమోదు చేయాలన్నారు. ఈనెల 25లోగా సర్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో వేణు తదితరులు పాల్గొన్నారు.