Share News

kumaram bheem asifabad- గడువులోగా డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 10:23 PM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల అదనపు కమిషనర్‌ పవన్‌కుమార్‌ అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్‌ అధికారి సుదర్శణ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, ఆర్డీవోలతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు.

kumaram bheem asifabad- గడువులోగా డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ కె హరిత, అధికారులు

ఆసిఫాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల అదనపు కమిషనర్‌ పవన్‌కుమార్‌ అన్నారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎలకో్ట్రరల్‌ అధికారి సుదర్శణ్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, ఆర్డీవోలతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఓటరను సమగ్ర సవరణలో భాగంగా సేకరించిన ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ఈ నెల 24న తేదీ వరకు పూర్తి చేయాలని తెలిపారు. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలలో 15 శాతం వరకు డిజిటలైజేషన్‌ జరిగిందని, ఇందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌, యాదాద్రి, భువన గిరి జిల్లాలో 50 శాతానికి పైగా డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తి అయిందని, ఆయా జిల్లాల కలెక్టర్‌లు తీసుకున్న చర్యలును అన్ని జిల్లాల కలెక్టర్‌లు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో వీసీ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ కె హరిత, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 50 శతం పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ ఫారాల ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్‌కు వివరించారు. పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, పూరించిన ఫారాలను తిరిగి సేకరించడం, డిజిటైలజేషన్‌ చేయడంలో వలంటీర్లుగా ప్రత్యేక కార్యదర్శులు, ఐకేపీ వీవోఏలు, గ్రామ పెద్దలు, పటేళ్లు, యువకులు, బూత్‌ స్థాయి ఏజెంట్ల సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. ఆదివాసీ పెద్దలు, రాయి సెంటర్‌ సహకారం తీసుకున్నామని తెలిపారు. అందరి సహకారంతో నిర్ణీత గడువులోగా 100 శాతం డిజిటలైజేషన్‌ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 10:23 PM