Share News

kumaram bheem asifabad-నత్తనడకన డిజిటల్‌ పంట నమోదు

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:08 PM

: కుమ రం భీం జిల్లాలో డిజటల్‌ పంట నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. డిజిటల్‌ క్రాప్‌ సర్వే(డీసీ ఎస్‌)తో రేపటి ధాన్యం, మొక్క జొన్నలు, సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు ప్రాతిపాదిక అవుతుం దని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తుండగా, ఈ దిశగా రైతులు ఆశించిన మేర సర్వేలకు పూర్తి స్థాయిలో మొగ్గు చూపడం లేదు. జిల్లాలోని రైతులు ఈ విషయాన్ని గమనించి కచ్చితమైన క్రాప్‌ బుకింగ్‌కు ఈ నెల 30న సర్వే గడువు పూర్తవుతు న్నప్పటికీ ఇంకా ఆశించిన లక్ష్యం చేరుకోవటం లేదు.

kumaram bheem asifabad-నత్తనడకన డిజిటల్‌ పంట నమోదు
లోగో

- లక్ష్యం చేరుకోవడంపై అనుమానాలు

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కుమ రం భీం జిల్లాలో డిజటల్‌ పంట నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. డిజిటల్‌ క్రాప్‌ సర్వే(డీసీ ఎస్‌)తో రేపటి ధాన్యం, మొక్క జొన్నలు, సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు ప్రాతిపాదిక అవుతుం దని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తుండగా, ఈ దిశగా రైతులు ఆశించిన మేర సర్వేలకు పూర్తి స్థాయిలో మొగ్గు చూపడం లేదు. జిల్లాలోని రైతులు ఈ విషయాన్ని గమనించి కచ్చితమైన క్రాప్‌ బుకింగ్‌కు ఈ నెల 30న సర్వే గడువు పూర్తవుతు న్నప్పటికీ ఇంకా ఆశించిన లక్ష్యం చేరుకోవటం లేదు. జిల్లాలో సర్వే జరుగాల్సిన క్షేత్రాలు 2,16,000 చేయాల్సి ఉండగా ఇందులో ఇప్పటికీ పూర్తి అయినవి 70000 అయ్యాయి. ఇంకా 1,16,000 డిజిటల్‌ సర్వే చేయాల్సి ఉంది. ఈ సర్వేలను గతంలో ఏఈవోలు మాత్రమే నిర్వహించే వారు దీంతో పని భారం పెరుగుతుండడంతో ఆ సారి ప్రైవేటు వలంటీర్లను నియమించి ఈ డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేయిస్తున్నారు. వలంటీర్లు ప్రస్తుతం గ్రామాల వారిగా సర్వే చేస్తున్నారు. సర్వే నెంబర్లలో రైతు వారీగా పంట వివరాలను నమోదు చేయడంతో పాటు క్షేత్రంలోనే ఫొటోలు తీసి ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. సర్వే నంబరు ద్వారానే పంటల నమోదు పూర్తవుతుంది. వలంటీరు చేసిన నమోదు వివరాలను సంబంధిత ఏఈవో భౌతికంగా పరిశీ లించి ఆమోదం తెలుపుతున్నారు. ఏవైనా పొరపాట్లు, తప్పులుంటే రైతుతో ధ్రువీకరించుకుని మళ్లీ వలంటీరుకు పంపిస్తున్నారు. తప్పులను సరి చేసి, సర్వే చేసిన తర్వాతనే పంట నమోదుకు ఏఈవో ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఆయిల్‌ఫాంలో అంతర పంటలు లేదా మరే ఇతర అంతర పంట నమోదలో రైతులకు రెండు సంక్షిప్త సమాచారాలు వేర్వేరుగా వస్తాయి. మెస్సెజ్‌ వచ్చిన 72 గంటల్లోగా రైతు సంబంధిత ఏఈఓను సంప్రదించి మళ్లీ ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు.

వానాకాలంలో..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు అన్ని రకాల పంటలు కలిపి దాదాపు 4.52 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. అందులో ప్రధానంగా 3,77, 764 ఎకరాల్లో పత్తి, 35,452 ఎకరాల్లో వరి, 26,443 ఎకరాల్లో కంది 3,820 ఎకరాల్లో సోయా, 6,698 ఎకరాల్లో మొక్కజోన్న, 895 ఎకరాల్లో మిను ములు, 1.245 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసు ్తన్నారు. జిల్లాలోని 15 మండలాల్లోని 443 రెవెన్యూ గ్రామా ల్లో డిజిటల్‌ క్రాఫ్‌ సర్వే చేపడుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ క్రాప్‌ సర్వే ద్వారా రైతులు సాగు చేసిన పంటల వివరాలు తెలియనున్నాయి. ఈ సర్వే ఆధారంగానే రైతులకు వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకాలను అమలు చేయనున్నారు. సన్న ధాన్యానికి బోనస్‌ అందించనున్నారు. అదేవిధంగా రైతు భరోసాతో పాటు పలు సంక్షేమ పథకాలను వర్తింపు చేయనున్నారు. దీంతో పాటు జిల్లాలో రైతు ఏపంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారో కూడా స్పష్టం కానుంది. ఒక్కో జిల్లాలో ఒక్కో రకం పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. జిల్లాలోని పలు మండలాల్లో రైతులు పత్తి పంటను ఎక్కువగా సాగు చేసుకుంటున్నారు. పంటల సాగు ఆధారంగానే ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, సాగునీరు, గిడ్డంగులు, కొనుగో లు కేంద్రాల ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

ఉపయోగాలు ఇలా..

డిజిటల్‌ సర్వే ద్వారా పంటల సాగు వివరాలను అధికారికంగా నమోదు అవుతాయి. అలాగే పంట కొనుగోలు సమయంలో రైతు సాగు వివరాలను దృవీకరించటానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం అందించే రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ సహాయ కార్యక్రమాల అమలుకు డేటా కూడా ఎంతగానో ఉపయోగపడనుంది. పంటకు సంబంఽ దించిన బ్యాంకు రుణాలు/వ్యవసాయ సేవల ప్రక్రియలో సాగు వివరాలు ఉపయోగపడే అవకా శం ఉంటుంది. పంట నష్టం, ప్రకృతి వైపరీత్యాల ప్రభా వం అంచనా వేయటానికి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగువుతోంది అనే ఖచ్చితమైన వ్యవసా య గణాంకాలు లభిస్తాయి. పంటల ఉత్పత్తిని ముందుగానే అంచనా వేసి కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్‌ ప్రణాళిక రూపొందించడా నికి సహాయ పడుతుంది.

వేగవంతం చేస్తున్నాం..:

- వెంకట్‌, జిల్లా వ్యవసాయాశాఖ అధికారి

డిజిటల్‌ క్రాప్‌ సర్వే పనులను వేగవంతం చేస్తున్నాం. జిల్లాలోని అన్ని గ్రామాల్లోని రైతులకు అవగహన కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా వలంటీర్లతో ఈ సర్వేలను చేయిసు ్తన్నాం. రైతులు కూడా ముందుకు వచ్చి తప్పకుండా పూర్తి సర్వేలు చేసుకుంటే బాగుటుంది. ఏఈవో, ఏవోలు జిల్లాలోని ఆయా గ్రామాల్లో స్వయంగా క్షేత్ర స్థాయి పర్యటన చేస్తున్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.

Updated Date - Sep 18 , 2026 | 11:08 PM