kumaram bheem asifabad- పల్లెకు డిజిటల్ కళ
ABN , Publish Date - Nov 10 , 2026 | 10:28 PM
గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చి స్వయం సమృద్ధే లక్ష్యంగా సమగ్రాభివృద్ధి సాధించేందుకు పంచా యతీ స్థాయిలో ప్రణాళికలు అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలం గాణ రైజింగ్-2047లక్ష్యాలకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతీ గ్రామానికి ఓ ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేసి, అందులో పంచాయతీకి సంబంధించిన సమగ్ర సమాచారం నమోదు చేయనున్నారు.
- అంశాల వారీగా డిజిటల్ ప్రొఫైల్ ఏర్పాటు
- జనాభా నుంచి పశు సంపద వరకు వివరాలు
- నిధులు, పనులు, లబ్ధిదారుల వివరాలు సైతం ఆన్‌లైన్‌లో నమోదు
బెజ్జూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చి స్వయం సమృద్ధే లక్ష్యంగా సమగ్రాభివృద్ధి సాధించేందుకు పంచా యతీ స్థాయిలో ప్రణాళికలు అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలం గాణ రైజింగ్-2047లక్ష్యాలకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతీ గ్రామానికి ఓ ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేసి, అందులో పంచాయతీకి సంబంధించిన సమగ్ర సమాచారం నమోదు చేయనున్నారు. గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, అమలుపై మార్గదర్శకాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- సమగ్ర అభివృద్ధిలో భాగంగా..
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళి క-2026లో భాగంగా ప్రతి గ్రామంలోని జనాభా, కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, ఉపాధి అవకాశాలు, గృహ వసతి, పశు సంపద, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, లబ్దిదారులకు సంబంఽ దించిన సమగ్ర సమాచారం ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు. జిల్లాలో 15మండలాల పరిదిలో 335పంచాయతీలు ఉన్నాయి. పల్లె పాలనలో పూర్తిస్థాయి పారదర్శకత, జవాబుదా రీతనం పెంపొందించేందుకు అత్యాధునిక సాంకే తిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు. ప్రతీ పంచాయతీకి ఓ ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందిం చనున్నారు. గ్రామంలో కొనసాగుతున్న వివిద అభివృద్ధి పనులు, వాటి పురోగతి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నంచి వచ్చిన నిధులు, వినియోగం ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజలు తెలుసుకునేం దుకు వీలుగా వెబ్‌సైట్‌తో పాటు డాష్‌బోర్డును అందుబాటులోకి తీసుకరానున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఐదేళ్ల వరకు సమగ్ర దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తారు. అభివృద్ధి ప్రణాళికల ద్వారా గ్రామాల వాస్తవ అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పను లు చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్దిదారులను గుర్తించడం, వివిద శాఖల నిధులను సమర్థవంతంగా వినియో గించేలా చూడనున్నారు. ప్రతి నెలా గ్రామసభలో పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు పురోగతిపై తప్పనిసరిగా సర్పంచులు సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది.
- ప్రభుత్వ శాఖల సమన్వయంతో..
పంచాయతీ పరిధిలో వివిధ శాఖలకు సంబం ధించిన సమగ్ర సమాచారం సేకరించి నమోదు చేసేందుకు గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక(జీపీ ఎస్‌ఏపీ) పోర్టల్ అందుబాటులోకి తీసుకరానున్నారు. పార్ట్-1లో గ్రామపంచాయతీ ప్రొఫైల్, పార్ట్-2లో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక(2026-29), పార్ట్-3లో శాఖల వారీగా వార్షిక పనులు, ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఆర్థిక ప్రగతి వివరాలను పోర్టల్ నమోదు చేస్తారు. 17అనుబంధ శాఖలతో సమన్వయం చేసుకొని వివరాలు సేకరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల అవ సరాలు, స్థానిక ప్రాధాన్యతల ఆధారంగా సంబంధిత ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ పంచాయతీల మౌలిక వసతులు, అభివృద్ధి పనులను ఎంపిక చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
- సమగ్ర వివరాలు..
ప్రతీ గ్రామపంచాయతీలో జనాభా, పంటలు, ఉపాధి అవకాశాలు, గృహ వసతి, భూమిలేని కూలీలు, బలహీనవర్గాలు, ప్రభుత్వ ఆస్తులు, పశు సంపద, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదా రులు, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉంటే గ్రామపంచా యతీ సమగ్ర అబివృద్ధి ప్రణాళిక అమల్లో అధికారుల అలసత్వాన్ని ఎంతమాత్రం సహించేది లేదంటూ ప్రభుత్వం హెచ్చరించింది. సమగ్ర సమాచారం సేకరించడంలో నిర్లక్ష్యం వహించినా, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే తప్పుడు సమా చారం పొందుపరిచినా సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. పం చాయతీ కార్యదర్శి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకూ ఈ చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
- పోర్టల్‌లో సమస్త సమాచారం..
పోర్టల్‌లో సమస్త సమాచారం నమోదు చేయ నున్నారు. పంచాయతీ పేరు, రెవెన్యూ గ్రామాలు, అనుబంధ గ్రామాలు, విస్తీర్ణం, గ్రామస్థాయిలో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, వారి మొబైల్ నంబరు, జనాభా, పురుషులు, మహిళలు, ఇతరు లు, కుటుంబాలు నమోదు చేస్తారు. అక్షరాస్యత, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతరులు, దివ్యాంగులు, రైతులు, వ్యవసాయ భూమి, నర్సరీలు, ఎన్ని కిలో మీటర్ల దూరం బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మట్టి రోడ్లు ఉన్నాయనే సమాచారం సైతం ఉంటుంది. పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల పరిదిలో ఎన్నెన్ని రోడ్లు ఉన్నాయి. ఏయే రోడ్లు ఎన్ని కిలో మీటర్ల దూరం ఉందనే విషయాలపై సైతం నమోదుకాకున్నాయి. తాగునీటి వసతి, విద్యుత్ కనెక్షన్లు, వీధి దీపాలు, మోటార్లు, విద్యుత్ సబ్ స్టేషన్, అండర్ డ్రైనేజీ సిస్టమ్, మురికి కాలువలు, మార్కెట్, వ్యక్తిగత మరుగుదొడ్లు, పార్కులు, సామాజిక భవనాలు, పాఠశాలలు, శిక్షణా కేంద్రాలు, అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాలు, మహిళా సంఘాలు, ఉపాధి హామీ పనుల లబ్ధిదారులు తదితర వివరాలను పోర్టల్‌లో నమోదు చేయను న్నారు. పార్ట్-2లో వచ్చే మూడేళ్లలో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికలు, పార్ట్-3లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలకు వచ్చే నిధు లు, చేపట్టనున్న పనుల వివరాలు పొందుపరచ నున్నారు.