Share News

రాష్ట్ర బడ్జెట్‌పై భిన్న స్వరాలు...!

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:25 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్న స్వరాలు వినిపిస్తున్నా యి. రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

రాష్ట్ర బడ్జెట్‌పై భిన్న స్వరాలు...!

-సర్కారు నిర్ణయంపై తలోమాట

-పీఆర్సీ ప్రస్తావన లేక ఉద్యోగుల పెదవి విరుపు

-విద్యారంగానికి అరకొర నిధులే..

-బడుగు బలహీన వర్గాలకు నిరాశే

-ఉద్యోగులకు ఉచిత వైద్యంపై హర్షాతిరేకాలు

మంచిర్యాల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్న స్వరాలు వినిపిస్తున్నా యి. రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసనసభలో ప్ర వేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ రూ. 3,24,234 కోట్లపై బ హుజనులు పెదవి విరుస్తుండగా, అల్ప సంఖ్యలో ప్ర భుత్వ వైఖరికి మద్దతుగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిం దనే చర్చ సాగుతోంది. జిల్లాకు ప్రత్యేకంగా నిధుల ప్రస్తావన లేకుండగా, గంప గుత్తగా ప్రకటించడం పట్ల ఆయా వర్గాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు.

విద్యా రంగానికి మొండి చేయి....

రాష్ట్ర బడ్జెట్‌లో ప్రజలకు కనీస అవసరాలైన విద్యా రంగానికి మొండి చేయి చూపడంపై వ్యతిరేక స్వరా లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చూపులకు జనాకర్షకంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వివిధ రంగాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరో పణలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్‌లో విద్యా, మాన వ వనరులకు కేటాయించింది రూ. 26,674 కోట్లు కా గా, కేటాయించిన మొత్తంలో ఆయా రంగాలకు కేవ లం 8.2 శాతం కావడంతో ప్రభుత్వం విమర్శలను మూట కట్టుకుంటోంది. ఇంటర్మీడియట్‌ వరకు విద్యా సంస్థల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై హ ర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యారంగానికి గత సంవత్సరాని కంటే రూ. 3,566 కోట్లు అదనంగా కే టాయించినప్పటికీ పెంచిన మొత్తం బ్రేక్‌ ఫాస్ట్‌, మ ధ్యాహ్న భోజన పథకం విస్తరణ, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకే సరిపోతుందన్న అభిప్రాయాలు ఉ న్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలి క వసతుల మెరుగుదల, మెనూ అమలుపై అదనపు నిధుల కేటాయింపు ప్రస్తావన లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయి స్తామని మేనిపెస్టోలో పేర్కొన్నప్పటికీ ఆ హామీ నె రవేర్చలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ఆయ్యే ఖర్చు మొత్తం రూ. 1056 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించా లనే డిమాండ్‌లు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంది...

డీసీసీ అధ్యక్షుడు, పిన్నింటి రఽఘునాథరెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజ నకంగా ఉంది. గతేడాదితో పోలిస్తే బడ్జెట్‌లో అన్ని వ ర్గాలకు కేటాయింపులు పెరిగాయి. వివిధ పథకాల అ మలుకు బడ్జెట్‌ రూపేణా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. బడుగు, బలహీన వర్గాలకు బ డ్జెట్‌లో పెద్దపీట వేయడం శుభపరిణామం.

వాస్తవికత లేని బడ్జెట్‌...టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేవలం జనాకర్షణే తప్ప... వాస్తవికత కానరావడం లేదు. వి ద్యా రంగానికి అరకొర కేటాయింపులు చేయడం వి చారకరం. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్యం అందించడాన్ని స్వాగతిస్తున్నాం. విద్యాలయా ల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏ ర్పాటు ఆహ్వానించదగ్గ విషయం. ఉద్యోగులకు పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరం.

బడుగు వర్గాలకు నిరాశే....

రంగు రాజేశం, కన్వీనర్‌ సామాజిక న్యాయ వేదిక

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ బడుగు బలహీన వర్గాలకు నిరాశే మిగిల్చింది. తెలంగాణలోని మెజార్టీ వర్గాలైన బీసీ, ఎస్సీ వర్గాల సంక్షేమం విషయంలో ని ర్థిష్ట ప్రతిపాదనలు బడ్జెట్‌లో కనిపించడం లేదు. ని ధుల కేటాయింపు నామ మాత్రంగా ఉంది. బీసీ వర్గాలకు రూ. 12.511 కోట్లు కేటాయించగా, దళిత వ ర్గాల సంక్షేమం కోసం రూ. 11,784 కోట్లు కేటాయిం చారు. ఆయా వర్గాల సంక్షేమానికి కేటాయించిన బ డ్జెట్‌ ఏ మాత్రం సరిపోదు. నిరుద్యోగ యువతకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకపోవడం అన్యాయం.

బడ్జెట్‌ సవరణ చేపట్టాలి...

పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి శ్రీకాంత్‌

బడ్జెట్‌లో తక్షణమే సవరణలు చేపట్టాలి. తెలంగా ణ విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి నివేదిక ను ప్రభుత్వం విస్మరించింది. నివేదికకు భిన్నంగా కాం గ్రెస్‌ ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యకు వత్తాసు పలికింది. విద్యారంగానికి గతంలో 7.57 శాతం నిధులు కేటా యించగా, ప్రస్తుతం 8.2 శాతం మాత్రమే కేటాయిం చారు. పెరిగిన వ్యయం కారణంగా ప్రభుత్వ నిర్ణయం సమంజసం కాదు. విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించేలా బడ్జెట్‌ సవరణ చేపట్టాలి.

Updated Date - Mar 20 , 2026 | 11:25 PM