చెంచు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:29 PM
అమ్రాబాద్ మండలం మన్న నూరులో ఏర్పాటు చేసిన ఐటీడీఏపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగు తోందని ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాసులు అన్నారు.
మన్ననూర్,ఆగస్టు 25 (ఆంధ్రజ్యో తి) : అమ్రాబాద్ మండలం మన్న నూరులో ఏర్పాటు చేసిన ఐటీడీఏపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగు తోందని ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాసులు అన్నారు. పీవీ టీజీ జేఏసీ, చెంచు ఐక్యవేదిక ఆధ్వ ర్యంలో మంగళవారం మన్ననూరు ఐటీడీఏకార్యాలయ ఆవరణలో మం గళవారం చెంచులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా నిమ్మల శ్రీనివాసులు మాట్లా డుతూ మన్ననూరులో ఐటీడీఏను ఇన్‌చార్జి పీవోలతో నెట్టుకొస్తున్నారని, చెంచుల అభి వృద్ధికి నిధులు మంజూరు కావడం లేదని ఆ రోపించారు. అధి కారంలోకి వచ్చాక ఐటీడీఏ రూపురేఖలను మారుస్తామని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా రెగ్యులర్ పీవో, అధి కారులను నియమించడంలో విఫలమయ్యార ని ఆరోపించారు. ప్రస్తుతం ఇన్‌చార్జీ పీవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్డీవో యాదగిరి చెం చులు సమ స్యలపై ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయ ఏవో జాఫర్ హుసేన్‌కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమం లో నాయకులు రామకృష్ణ, వర్కింగ్ ప్రసిడెంట్ రమేశ్‌రెడ్డి, అప్పాపూర్ మాజీ స ర్పంచు బాల గురువయ్య, రాష్ట్ర చెంచు ఐక్యవే దిక నాయకులు తిరుపతి, వేణు, రమేశ్, మహే శ్, మంజుల, బయ్యన్న పాల్గొన్నారు.