DGP Shivdhar Reddy: నేరరహిత సమాజమే లక్ష్యం
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:51 AM
నూతన సంవత్సరంలో మరింత పకడ్బందీ కార్యాచరణతో నేర రహిత సమాజ స్థాపన కోసం కృషి చేయాలని అధికారులు, సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరంలో మరింత పకడ్బందీ కార్యాచరణతో నేర రహిత సమాజ స్థాపన కోసం కృషి చేయాలని అధికారులు, సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గతేడాది మాదకద్రవ్యాల కట్టడి, సైబర్ నేరాలు, ఇతర నేరాల్ని అరికట్టడంలో పోలీస్ శాఖ విశేషమైన కృషి చేసిందని తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో గురువారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మరో కార్యక్రమంలో శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. యూనిఫాం ధరించి విధుల్లో ఉండే పోలీ్‌సలకు మినిస్టీరియల్ స్టాఫ్ వెన్నుముక లాంటి వారని కొనియాడారు. ఈ విభాగంలో 40ు వరకు మహిళా సిబ్బంది ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో కవిత చదివి వినిపించిన ఓ మహిళా ఉద్యోగినికి డీజీపీ శివధర్ రెడ్డి రూ. 10 వేల బహుమతి ప్రకటించారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జలవిహార్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న డీజీపీ.. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమైందని ప్రశంసించారు.