పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుంది: డీజీపీ సీవీ ఆనంద్
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:17 AM
పదోన్నతి వల్ల గౌరవంతో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఇటీవల సీఐల నుంచి డీఎస్పీలుగా పదోన్నతి...
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): పదోన్నతి వల్ల గౌరవంతో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఇటీవల సీఐల నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందికి సోమవారం పోస్టింగ్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ.. పదోన్నతితో పోలీస్ శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల సమస్యల్ని సత్వరమే గుర్తించి పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. డీఎస్పీ హోదాలో ప్రతి నిర్ణయం ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలని డీజీపీ చెప్పారు.