గోదావరి పుష్కరాలకు సిద్ధం కండి: డీజీపీ
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:05 AM
గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లపై తగిన చర్యలు తీసుకోవాలని బీజీపీ బి. శివధర్ రెడ్డి అన్నారు. డీజీపీ కార్యాలయంలో ...
గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లపై తగిన చర్యలు తీసుకోవాలని బీజీపీ బి. శివధర్ రెడ్డి అన్నారు. డీజీపీ కార్యాలయంలో బుధవారం వివిధ జిల్లాల పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సౌకర్యాలపై దిశానిర్దేశం చేశారు. పుష్కరాల భద్రత ఏర్పాట్ల నిర్వహణలో ఈసారి అత్యాధునిక ‘టెక్నాలజీ’ని పెద్ద ఎత్తున వినియోగించాలని ఆయన సూచించారు. శైలజారామయ్యర్ మాట్లాడుతూ.. గోదావరి నది ప్రవహిస్తున్న నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో అధికారులు పనులను ప్రారంభించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేష్ ఎం భగవత్, ఐజీపీలు ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, గజరావు భూ పాల్, శాంతి భద్రతల ఏఐజీ రమణ కుమార్, వివిధ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, ఎండోమెంట్ శాఖాధికారులు తమ అభిప్రాయాలు తెలియజేశారు.