Share News

క్వారీ జాతరకు పోటెత్తిన భక్తులు..

ABN , Publish Date - Aug 02 , 2026 | 11:29 PM

మండలంలోని ర్యాలీగడ్‌పూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న క్వారీ శ్రీ దుర్గామాత జాతర మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు దుర్గామాతను దర్శించుకోవడానికి క్యూలైన్‌లలో బారులు తీరారు.

క్వారీ జాతరకు పోటెత్తిన భక్తులు..

హాజీపూర్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ర్యాలీగడ్‌పూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న క్వారీ శ్రీ దుర్గామాత జాతర మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు దుర్గామాతను దర్శించుకోవడానికి క్యూలైన్‌లలో బారులు తీరారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు కుటుంబ సమేతంగా దుర్గామాతను దర్శించుకుని పూజలు నిర్వహించారు. మంచిర్యాల మున్సిపల్‌ కార్పోరేషన్‌ మేయర్‌ ధర్ని మధుకర్‌, డిప్యూటి మేయర్‌ రమ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బానేష్‌, వైస్‌ చైర్మన్‌ జాలే రాయలింగు, అధికారులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో జాతరలో పాల్గొన్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తాగునీరు, పారిశుధ్య్ద నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ, వైద్య సదుపాయాలు, పోలీసులు భద్రత ఏర్పాట్లు తదితర సౌకర్యాలను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేశారు. ఈ జాతరలో ఎంపీడీవో సాయివెంకట్‌రెడ్డి, ఎంపీవో సుమన్‌, సర్పంచు స్వప్నవిజయ్‌కుమార్‌, ఉపసర్పంచు బేర వెంకటేష్‌, పంచాయతీ కార్యదర్శులు సత్యనారాయణ, రాజశేఖర్‌, సదయ్య, సిబ్బంది, కార్మికులు,అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 11:29 PM