Share News

kumaram bheem asifabad- మహా పాదయాత్రకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:34 PM

కాగజ్‌నగర్‌ నుంచి టోంకిని వరకు మంగళవారం చేపట్టిన 25వ మహా పాదయాత్రకు భక్తులు పోటెత్తారు. ఈ పాదయాత్రపై గత కొన్ని రోజులు విసృత ప్రచారం చేపట్టడంతో జిల్లా నలుమూల నుంచి మంగళవారం వేకువజాము నుంచే భక్తులు తరలి వచ్చారు. కాగజ్‌నగర్‌ హనుమాన్‌ ఆలయంలో హనుమాన్‌ జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు

kumaram bheem asifabad- మహా పాదయాత్రకు పోటెత్తిన భక్తులు
టోంకిని వద్ద ఉన్న భక్తుల రద్దీ

- ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు ప్రత్యేక పూజలు

సిర్పూరు(టి)/కాగజ్‌నగర్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ నుంచి టోంకిని వరకు మంగళవారం చేపట్టిన 25వ మహా పాదయాత్రకు భక్తులు పోటెత్తారు. ఈ పాదయాత్రపై గత కొన్ని రోజులు విసృత ప్రచారం చేపట్టడంతో జిల్లా నలుమూల నుంచి మంగళవారం వేకువజాము నుంచే భక్తులు తరలి వచ్చారు. కాగజ్‌నగర్‌ హనుమాన్‌ ఆలయంలో హనుమాన్‌ జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. కాగజ్‌నగర్‌లోని 30 వార్డుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆసిపాబాద్‌, కెరమెరి, వాంకిడి, రెబ్బెన, తాండూరు, మంచిర్యాల నుంచి భక్తులు రావడం విశేషం. కాగజ్‌నగర్‌ నుంచి ప్రారంభమైన మహా పాదయాత్రలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ పాదయాత్రలో 23 కిలోమీటర్ల స్వయంగా నడిచి భక్తులను ఉత్తేజ పరిచారు. ఒక వైపు చలి అధికంగా ఉండడంతో మరో వైపు పాదయాత్రతో సోమవారం రాత్రి నుంచే భక్తులు రావడం ప్రారంభించారు. సూదుర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుండడంతో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. స్థానిక వెల్‌కం హోటల్‌ వారి ఆధ్వర్యంలో భక్తులకు అల్పహారం, అలాగే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి అదిత ఆధ్వర్యంలో భక్తులు నీటి వసతి, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మహా పాదయాత్ర సందర్భంగా సిర్పూరు పోలీసులు ఆంక్షలు విధిం చారు. ఎలాంటి భారీ వాహనాలను పోనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. టోంకిని ఆలయ సమీపానికి అరకిలో మీటరు దూరంలోనే ద్విచక్ర వాహనాలు, ఆటోలను రానీయకుండా పక్కాగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కమిటి సభ్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్‌ కూడా ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో డీఎస్పీ హబీబ్‌ ఆధ్వ ర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఆలయ సమీపంలోనే పెన్‌గంగా ఉండడం ఈ గంగలోనే మొసళ్లు అధికంగా ఉండడంతో స్నానాలు చేసేందుకు వచ్చి న వారిని ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బృంద సభ్యులు ఎవరిని అనుమతించలేదు.

Updated Date - Nov 17 , 2026 | 10:34 PM