Share News

పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు

ABN , Publish Date - Nov 01 , 2026 | 10:01 PM

గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు ఆదేశించారు.

పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు

గూడెం పుష్కర ఘాట్‌ పనులను పరిశీలించి కలెక్టర్‌

దండేపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు ఆదేశించారు. ఆదివారం మండలంలోని గూడెం గోదావరి వద్ద చేపట్టే పుష్కర ఘాట్‌ను ఆయన సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతి ని సంబం ధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఘాట్‌ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప నులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఆ దేశించారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారులు, తా గునీరు, పారిశుధ్యం తదితర సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించా లన్నారు. భద్రతా ఏర్పాట్లు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గోదా వరి పుష్కరాలకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు మెరు గైన సౌకర్యాలు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సిబ్బంది సూచించారు. ఆయన వెంట సంబంధిత శాఖ అధికా రులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 10:01 PM