kumaram bheem asifabad- వనదేవతలకు భక్తుల మొక్కులు
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:18 PM
జిల్లాలోని ఆసిఫాబాద్, బెజ్జూరు, దహెగాం మండలాల్లో గురువారం వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని పెద్దవాగు సమీపంలో సమ్మక్క- సారలమ్మ గద్దెల వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం సమ్మక్క తల్లి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆసిఫాబాద్‌రూరల్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆసిఫాబాద్, బెజ్జూరు, దహెగాం మండలాల్లో గురువారం వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని పెద్దవాగు సమీపంలో సమ్మక్క- సారలమ్మ గద్దెల వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం సమ్మక్క తల్లి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలోని రేచిని గ్రామ సమీపంలోని తెల్ల రాళ్లగుట్ట అటవీ ప్రాంతంలో నిర్వహించిన సమ్మక్క- సారలమ్మ జాతర ఉత్సవాలు గురువారం ముగివశాయి. వనదేవతల దర్శణం కోసం వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని పలు గ్రామాల నుంచి భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో కొలువై ఉండడంతో భక్తులు ఎడ్లబండ్లపై చేరుకున్నా రు. జాతర ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం కోసం బెజ్జూరు ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించగా పోలీసుల ఆధ్వర్యంలో బందో బస్తు ఏర్పాటు చేశారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలంలోని కుంచవెల్లి, రావులపల్లి, దహెగాం గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ జాతరను గురువారం భక్తులు ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. వన దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.