Share News

భీమన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:14 AM

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. ఆయా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీస్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లలో

భీమన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
భక్తులతో సందడిగా మారిన భీమన్న ఆలయ ఆవరణ

వేములవాడ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. ఆయా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీస్వామి వారి దర్శనం కోసం క్యూలైన్‌లలో బారులు తీరారు. ధర్మ దర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌లా ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని భీమన్నను దర్శించుకోగా శ్రీస్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు కోడెమొక్కుబడి క్యూలైన్‌లో భక్తులు గంటల తరబడి బారులు తీరారు. ఆలయంలోకి చేరుకున్న భక్తులు ముందుగా కోడెమొక్కు చెల్లించుకుని భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గండాదీపంలో నూనె పోస్తూ గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు. గాయత్రీమాత ఆలయంలో కుంకుమ పూజలో పాల్గొని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి దీపారాధన గావించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Sep 29 , 2026 | 12:14 AM