kumaram bheem asifabad- దేవీ నవరాత్రి వేడుకలు ప్రారంభం
ABN , Publish Date - Oct 11 , 2026 | 10:33 PM
జిల్లా వ్యాప్తంగా ఆదివారం దేవీ నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో దేవి నవరాత్రిఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పైకాజీనగర్ బజారువాడి, సందీప్‌నగర్, బ్రాహ్మణవాడ, కంచుకోట, రావులవాడ, జన్కాపూర్, టీఆర్ నగర్, రాజంపేట, గాంధీచౌక్ కాలనీలలో అమ్మవారి విగ్రహలను ప్రతిష్టించి భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్/వాంకిడి/బెజ్జూరు/రెబ్బెన/దహెగాం, అక్టోబరు 11 (ఆంధ్ర జ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఆదివారం దేవీ నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో దేవి నవరాత్రిఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పైకాజీనగర్ బజారువాడి, సందీప్‌నగర్, బ్రాహ్మణవాడ, కంచుకోట, రావులవాడ, జన్కాపూర్, టీఆర్ నగర్, రాజంపేట, గాంధీచౌక్ కాలనీలలో అమ్మవారి విగ్రహలను ప్రతిష్టించి భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. :కాగజ్‌నగర్ పట్టణంలోని 30 వార్డుల్లో ఆదివారం సాయంత్రం వివిధ కూడళ్లలో దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్టించారు. ఈసుగాంలో ఆలయంలో త్రిపురదేవి సుందరి ఆవతారంలో అమ్మ వారు భక్తులకు దర్శించటంతో ప్రత్యేక పూజలు చేపట్టారు. వాంకిడి మండలంలో శారదా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రులను పురస్కరించుకొని వాడవాడల అమ్మవారి విగ్రహాలు కొలువుదీరాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. బెజ్జూరు మండలంలో దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా దుర్గామాత విగ్రహాలు ప్రతిష్ఠించారు. భాజాభజంత్రీల మధ్య దుర్గామాతను ఆయా మండపాల వద్ద ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. : రెబ్బెన మండలంలోని ఇందిరానగర్‌లో వెలసిన శ్రీ కనకదుర్గా దేవి మహాంకాళి ఆలయంలో ఆదివారం దుర్గమ్మ తల్లిని ఏర్పాటు చేశారు. మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారికి దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారిని పసుపు కొమ్ములతో తయారు చేయారు.ఆలయ అఽధ్యక్షుడు తిరుపతి గౌడ్, సుకన్య దంపతులు, గ్రామ సర్పంచ్ దారవత్ కృష్ణ అరుణ, ఉప సర్పంచ్ మిట్ట వెంకటేష్ వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. అలాగే అమ్మవారిని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి అజ్మీర శ్యాం నాయక్ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దహెగాం మండలంలో వివిధ కూడళ్లలో దుర్గామ్మ తల్లి విగ్రహాలను భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేశారు. భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.