Share News

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:06 AM

గ్రామాల్లో అభివృద్ధి పనులను వే గంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు. మం గళవారం మండలంలోని చౌటపల్లి గ్రామంలో పర్యటించారు. పారిశుధ్య పను లను, మురుగు కాలువలను పరిశీలించారు.

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి
చౌటపల్లి గ్రామంలో పర్యటిస్తున్న అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

తాండూర్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో అభివృద్ధి పనులను వే గంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు. మం గళవారం మండలంలోని చౌటపల్లి గ్రామంలో పర్యటించారు. పారిశుధ్య పను లను, మురుగు కాలువలను పరిశీలించారు. గ్రామంలోని కాలనీల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు గ్రామాల్లో పారిశుధ్య పనులను నిర్వహించాలని, మురుగు కాలువలను శుభ్రం చేయాల న్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నర్సరీ, వై కుంఠదామం, సెగ్రిగేషన్‌ షెడ్డులను సందర్శించి పలు సూచనలు చేశారు. ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. చౌటపల్లి గ్రామం పీఎంఏజేఏవై పథకానికి ఎంపికైన సందర్భం గా పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని ఈ ప్రాజెక్టు పను లు సక్రమంగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట డివిజనల్‌ పంచాయతీ అధికారి సతీష్‌కుమార్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో అనిల్‌కుమార్‌, సర్పంచు సునీత, కార్యదర్శి వసంత ఉన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 12:07 AM