Share News

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:39 PM

ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పారిశుధ్య్దం నిర్వహణ, అభివృద్ధి పనులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ముదిగుంటలో ఇంకుడుగుంతల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

జైపూర్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పారిశుధ్య్దం నిర్వహణ, అభివృద్ధి పనులను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ముదిగుంట గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమపథకాల అమలు తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామీణ స్థాయి నుంచి పారిశుధ్య్ద నిర్వహణ ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువల శుభ్రతను మరింత మెరుగుపర్చాలన్నారు. ప్రతి ఇంటి నుంచిచెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని పేర్కొన్నారు. పన్నుల వసూలును వేగవంతం చేయాలన్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పంచాయతీ కార్యదర్శికి పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై పలు సూచనలు చేశారు. మన్‌కీబాత్‌ కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ ప్రశంసించిన పంచాయతీలోని రూఫ్‌ టాప్‌ రైన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ నిర్మాణాన్నిపరిశీలించారు. గ్రామంలో డ్రైనేజీల చిరవన కమ్యూనిటీ సోక్‌పి్స్‌ ఏర్పాటు చేసి నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, సర్పంచు నవీన్‌, ఏపీవో, సర్పంచు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 11:40 PM