Share News

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:44 PM

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. బుధవారం చెన్నూరు మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. బుధవారం చెన్నూరు మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ క్రమంలో నిర్మాణపనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతంర చెన్నూరు పట్టణంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకుమెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. అనంతరం అమృత్‌ 2.0 పథకం కింద పట్టణంలో చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణాలను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట సంబందిత అధికారులు ఉన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 11:44 PM