kumaram bheem asifabad- అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jan 20 , 2026 | 10:30 PM
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి మంగళవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి మంగళవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ నిధుల కింద మంజూరైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, అర్హులైన వారికి అందేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మారు మూల గారమాలలో రవాణా సదుపాయాలు మెరుగు పడే విధంగా రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందే విధంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు పని దినాలు కల్పించాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు 100 శాతం అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వచ్చే వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల కోసం విద్యార్థులను సన్నద్ధం చేయాలని చెప్పారు. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ గురుకులాలు పేద విద్యార్థులకు వరం
ఆసిఫాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు ప్రభుత్వ గురుకులాలు వరం లాంటివని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ లోకేశ్వర్రావు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి నదీమలతో కలిసి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యూకేషన్ ఇన్సిట్యూషన్ సోసైటీ ద్వారా మైనార్టీ గురుకులాల ప్రవేశాల గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు గురుకులాల ద్వారా ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు. గురకులాల్లో అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నామని చెప్పారు. 6, 7, 8 తరగతులలో మైనార్టీ విద్యార్థులకు ఖాళీలు ఉన్న చోట ప్రవేశాలు కల్పించనున్నామన్నారు.విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.