Share News

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:38 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం తాండూర్‌లోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పను లను పరిశీలించారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

తాండూర్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం తాండూర్‌లోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పను లను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. అధికారులు పనులను పర్యవేక్షించాలన్నారు. అనంతరం ద్వారకాపూర్‌ గ్రా మంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను తహసీల్దార్‌ జ్యోత్స్నతో కలిసి పరిశీలిం చారు. భూ రీసర్వేను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. భవిష్యత్‌లో భూ వివాదాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనుల పురోగతి, ఆసరా పింఛన్‌ల దరఖాస్తుల వివరాలను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిష్టర్‌లను తనిఖీ చేశారు. గర్భిణీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. అనంతరం మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా సమగ్ర సవరణలో మ్యాపింగ్‌ కానీ, అనామలిస్‌ జాబితా ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఓటర్లు అందిస్తున్న ధృవప్రతాల పరిశీలన వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్‌, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:38 PM