Share News

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Jun 30 , 2026 | 11:09 PM

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చే యాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మం గళవారం చెన్నూరులో నూతనంగా నిర్మిస్తు న్న నైపుణ్య అబివృద్ధి కేంద్రం నిర్మాణ పనుల ను పరిశీలించారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
చెన్నూరులో బీఎల్‌ఏలకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చే యాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మం గళవారం చెన్నూరులో నూతనంగా నిర్మిస్తు న్న నైపుణ్య అబివృద్ధి కేంద్రం నిర్మాణ పనుల ను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నిరు ద్యోగ యువతకు ఉపాధి కల్పించే చర్యల్లో భా గంగా చెన్నూరులో చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే లా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వం ద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరి శీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనులు తుది ద శకు చేరుకున్నాయని తెలిపారు. అలాగే అ మృత్‌ 2.0 పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకు నిర్మాణం, పైపులైన్‌ పనులను పరిశీ లించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి రిజిష్టర్‌లు, తరగతి గదులు, వంటశాల, పరిసరాలను పరి శీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం మెనూ ప్రకారం అందించాలన్నారు. పదవ తర గతి విద్యార్థులతో మాట్లాడి ఫిజిక్స్‌ సబ్జెక్టులో విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలిం చారు. అనంతరం 3,4,11 వార్డుల్లో ఓటరు జా బితా సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను పరిశీలించి బీఎల్‌ఏలకు తగు సూచనలు చేశా రు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ మల్లికార్జున్‌, మున్సిపల్‌ కమీషనర్‌ ఉన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 11:10 PM