Share News

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:34 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పను లను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
ఎంపీడీవో కార్యాలయంలో అధికారులకు సూచనలు ఇస్తున్న జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

హాజీపూర్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పను లను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం హాజీపూర్‌ మండల కేంద్రంలోని కస్తూర్బాగాం ధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. భో జనశాల, అదనపు గదు నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అం దిస్తుందని ఈ క్రమంలో పాఠశాలల్లో చేపట్టి న అభివృద్థి పనులను వేగవంతం చేయాల న్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. తహసీల్దార్‌ పుష్పలతతో క లిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను పరిశీలించారు. ప్రజల నుంచి సేకరించిన ఎన్యుమరేషన్‌ ఫారాల డిజి టలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే భూభారతి, సాదాబైనామా, రె వెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరి ష్కార ప్రక్రియను తీరును పరిశీలించి ప లు సూచనలు చేశారు. మండల ప్రజాప రిష త్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి మండ లంలోని గ్రామపంచాయతీల పనితీరు, ప్రభు త్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్య్దపనులను నిరంతరం చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. తాగునీటి సరఫరాలో ఎలాం టి అంతరాయం లేకుండా చూడాలని, ప్రతి రోజు పనులను అధికారులు పర్యవేక్షించాల న్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ని ర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతి పనిని బాధ్యతా యుతంగా నిర్వహించాలని తెలిపారు. పంచా యతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చే యాలన్నారు. అనంతరం లక్షెట్టిపేట మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అత్యవసర విభాగం, సామాజిక వార్డులు, ల్యాబ్‌, మందుల నిల్వలు, పారిశుధ్య్ద నిర్వహణ, ఓపీ, రిజిష్టర్‌లను పరి శీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరు గైన వైద్యం అందించాలని సూచించారు. కలె క్టర్‌ వెంట అధికారులు ఉన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 11:34 PM