Share News

kumaram bheem asifabad-అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Sep 03 , 2026 | 11:08 PM

జిల్లాలో వివిధ పథకాల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ఐటీడీఏ పీవో మంద మకరందు, జిల్లా అటవిశాఖ అదికారి బాలామణిలతో కలిసి జిల్లాలో వివిధ శాఖల ద్వారా పనులు అటవీశాఖ అనుమతుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad-అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ పథకాల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ఐటీడీఏ పీవో మంద మకరందు, జిల్లా అటవిశాఖ అదికారి బాలామణిలతో కలిసి జిల్లాలో వివిధ శాఖల ద్వారా పనులు అటవీశాఖ అనుమతుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భూముల రీసర్వేలో రెవెన్యూ, అటవీశాఖ మధ్య వివాదాలు గల భూములను జాయింట్‌ సర్వే నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రధానమంత్రి జన్‌మన్‌ పథకం కింద మంజూరైన గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని చెప్పారు. అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ అధ్వర్యంలో పలు మండలాల్లో బీటీ రోడ్లు, వంతెనలు, కల్వర్టులు మంజూరయ్యాయని చెప్పారు. సంబందిత అటవీశాఖ అనుమతులు త్వరగా పొంది పనులు చేపట్టాలని తెలిపారు. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధ్వర్యంలో చేపడుతున్న రహదారులు, గ్రామపంచాయతీ భవనాలు, మండల సమాఖ్య భవనాలు, సీసీ రోడ్డు పనులు త్వరగా చేపట్టాలని చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, జీయో సంస్థల సెల్‌ టవర్ల నిర్మాణం కోసం అవసరమైన అనుమతులు పొంది పనులు వేగవంతంగా పూర్తి చేసి నెట్‌వర్క్‌ సేవలను మారుమూల గ్రామాలకు అందుబాటులోకి తీసుకు రావాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో అటవిశాఖ డివిజనల్‌ అధికారులు భార్గవ్‌, అప్పయ్య, హౌసింగ్‌ పీడీ ప్రకాష్‌రావు, పీఆర్‌ఈఈ ధర్మేందర్‌, డీపీవో భిక్షపతి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం

స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కూలీలు చేపల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకొని అదనపు ఆదాయం పొందవచ్చని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో గురువారం వీబీజీ రాంజీ పథకం కింద చేపట్టిన పంటకుంట, నీటికుంట, ఊటకుంటలలో ప్రధానమంత్రి కేఏఎస్‌వై ద్వారా జల్‌ జీవిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు చేపపిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయ భూములలో ఊట,నీటి, పంట కుంటల నిర్మాణాలు చేపట్టి వాటిలో చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, ప్రాజెక్టు అధికారి అంజనేయులు, జల్‌ జీవిత స్వచ్ఛంద సంస్థ సంచాలకుడు పద్మాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2026 | 11:08 PM