kumaram bheem asifabad-అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Nov 12 , 2026 | 10:24 PM
పర్యావరణాన్ని కాపాడుకుంటూ వన్యప్రాణులను రక్షించుకుంటూ అటవీశాఖ అనుమతులతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఐటీడీఏ పీవో మంద మకరందు, జిల్లా అటవీ అధికారి బాలామణిలతో కలిసి జిల్లాస్థాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ఆసిఫాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని కాపాడుకుంటూ వన్యప్రాణులను రక్షించుకుంటూ అటవీశాఖ అనుమతులతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఐటీడీఏ పీవో మంద మకరందు, జిల్లా అటవీ అధికారి బాలామణిలతో కలిసి జిల్లాస్థాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులు అర్హులైన ప్రతీ ఒక్కరికి చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ, స్వయం సహాయక భవనాలు, పంచాయతీరాజ్ రహదారులు ఇతర ఇంజనీరింగ్ శాఖల పరిధిలోని రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ అనుమతులు పొంది పనులు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియలో అటవీ, రెవెన్యూశాఖల సమన్వయంతో సరిహద్దు వివాదాలు పరిష్కరించాలని సూచించారు. వీబీజీ రామ్‌జీ పథకం కింద కూలీలకు పనుల కల్పనలో భాగంగా పెద్ద ఎత్తున చెక్‌డ్యాం నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఐటీడీఏ పీవో మంద మకరందు మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులలో అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్ భూముల సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అటవీ అధికారి బాలామణి మాట్లాడుతూ జిల్లాలో అటవీ భూమి అక్రమణ జరుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంబంధితశాఖల అఽధి కారులు అటవీశాఖకు సహకరించాలని కోరారు. అభివృద్ధి పనులలో పారదర్శకంగా అనుమతులు మంజూరు చేయనున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.