Share News

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:46 AM

జిల్లాలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం పరిధిలోని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
ధర్మపురి గోదావరి పుష్కర ఘాట్ల పనుల గురించి తెలుసుకుంటున్న కలెక్టర్‌

జగిత్యాల, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం పరిధిలోని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్న పనులు, ప్రారంభం కాని పనుల వివరాలను సమీక్షించారు. జిల్లాలో 2,949 పనులకు రూ. 497.03 కోట్ల అంచనా వ్యయం ఉండగా, ఇప్పటివరకు రూ. 128.13 కోట్ల వ్యయం జరిగినట్లు తెలిపారు. వీటిలో 842 పనులు పూర్తి కాగా, 839 పనులు పురోగతిలో, 1,268 పనులు ప్రారంభం కాలేదన్నారు. 127 ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్‌ అంశాలు చాలాకాలంగా పరిష్కారం కాకుండా ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 2026 సెప్టెంబరు 11 నాటికి జిల్లాలో మొత్తం 971 ఉపాధి హామీ పనులకు రూ.77.44 కోట్ల అంచనా వ్యయం ఉండగా, 304 పనులు పూర్తయ్యాయని, 464 పనులు పురోగతిలో ఉన్నాయని, 205 పనులు ప్రారంభం కాలేదన్నారు. వెంటనే పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఓటరు జాబితాపై ప్రచారం

ఈ నెల 12వ, 13వ తేదీల్లో ఓటరు జాబితాల ప్రత్యేక ప్రచారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2026 అక్టోబర్‌ 1వ తేదీ అర్హతగా చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమ గ్ర సవరణ - 2026లో భాగంగా క్లయిమ్‌లు, అభ్యంతరాల స్వీకర ణకు రెండో విడత ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

ఎస్‌ఐఆర్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

ధర్మపురి: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. ధర్మపురి మున్సిపల్‌ పరిధిలో కొనసాగుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నో మ్యాపింగ్‌, అనామలీస్‌ ఓటర్లకు నోటీసులు వ్యక్తిగతంగా అందించాలని అన్నారు. అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు, తేడాలు చోటు చేసుకోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురిలోని గోదావరి నది వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జగిత్యాల ఆర్‌డీవో మదుసూధన్‌, ధర్మపు రి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేముల నాగలక్ష్మి, మండల తహసీల్దార్‌ ఏరుకొండ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మామిళ్ల శ్రీనివాస్‌రావు, పీఆర్‌, ఇరిగేషన్‌ ఈఈ లు లక్ష్మణ్‌రావు, సత్యనారాయణ, డీఈఈలు గోపాల్‌, చక్రు, ఏఈఈలు మహేం దర్‌, మహేష్‌. బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:46 AM