Share News

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:16 PM

కస్తూర్భా గాంధీ విద్యాలయంలో చేపట్టిన అభివృద్ధి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అధికారులకు సూచించారు. నస్పూర్‌ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంను అదనపు కలెక్టర్‌ చంద్రయ్య బుధవారం సందర్శిం చారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

నస్పూర్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : కస్తూర్భా గాంధీ విద్యాలయంలో చేపట్టిన అభివృద్ధి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అధికారులకు సూచించారు. నస్పూర్‌ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంను అదనపు కలెక్టర్‌ చంద్రయ్య బుధవారం సందర్శిం చారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు నమోదు, రికార్డులు, ఇతర పరిపా లన రికార్డులు, వంట గది, స్టోర్‌ రూమ్‌, తరగతి గ దులను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల అభ్యాస స్థాయిలను నిరంతరం ప ర్యవేక్షించాలని సూచించారు. మెరుగైన ఫలితాలపై దృష్టి సారించాలన్నారు. పాఠశాల అవరణలో పరిశుభ్రత పాటించాలని, నాణ్యమైన భోధన కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి విద్యా సదుపాయాలు, భోజన తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా విద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీ లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనులు నిర్ధేశించిన గడువులోగ పూర్తి చేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్లక్ష్యానికి తావు లేకుండా పనులు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని క్రమ శిక్షణతో చదివి ఉన్నత స్తాయిలకు చేరాలన్నారు. విద్యాతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం పరిశుభ్రత పట్ల శ్రద్ద చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:16 PM