విద్యాసంస్థల్లో అభివృద్థి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:27 PM
ప్రభుత్వ విద్యాసంస్థల్లో జరు గుతున్న అభివృద్థి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం మండలంలోని రేగులగూడెం ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేజీబీవీ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కలెక్టర్ కుమార్ దీపక్
కాసిపేట, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ విద్యాసంస్థల్లో జరు గుతున్న అభివృద్థి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం మండలంలోని రేగులగూడెం ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేజీబీవీ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో నిర్మిస్తున్న భోజనశాల, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, వంటశాల పనులను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరీ గోడ, అద నపు గదులతో పాటు సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తూ నాణ్యమైన విద్య అందిస్తుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాల ల్లోనే చేర్పించాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహా రం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే నిత్యవసర సరు కులను సరైన పద్ధతిలో నిల్వ చేసి తాజా కూరగాయలతో ఆహారం త యారు చేయాలన్నారు. రేగులగూడెం ఆశ్రమ పాఠశాలలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణాలను పరిశీలించి వేగవంతంగా చేయా లని సూచించారు. పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.