అభివృద్ధి పనులే కాంగ్రెస్‌కు పట్టం కడతాయి
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:27 PM
రెండేళ్లలో చేసిన అభివృద్ధి ప నులే కాంగ్రెస్‌కు పట్టం కడుతాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే శుక్రవారం విడుదల చేశారు.
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు
మంచిర్యాలక్రైం, జనవరి30 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో చేసిన అభివృద్ధి ప నులే కాంగ్రెస్‌కు పట్టం కడుతాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రెండేళ్లలో చేసిన అభివృద్ధే కార్పొరేషన్‌ను కాంగ్రెస్ వశం చేసుకుంటుం దని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ల అభ్యర్థుల పేర్లను మీడియా ముందు ప్రకటించారు. ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెద్ద ఎత్తున నిధులను తీ సుకొస్తానని భరోసా ఇచ్చారు. రెండు వేల పడకల ఆసుపత్రి ఏర్పాటు చే యడమే తన లక్ష్యమన్నారు. విద్యా, వైద్యం కోసం ఎవరు కూడ ఇతర ప్రాం తాలకు వెళ్లే పరిస్థితి రాదని వివరించారు. గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద చేప పిల్లల పెంపకం కేంద్రం జాతీయ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో అభ్యర్థులతో పాటు నాయకులు డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి పాల్గొన్నారు.