Share News

అభివృద్ధి పనులు నాణ్యతగా ఉండాలి

ABN , Publish Date - Mar 17 , 2026 | 11:05 PM

ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా, వేగంగా చేపట్టాలని కలెక్టర్‌ బదావ త్‌ సంతోష్‌ అన్నారు.

అభివృద్ధి పనులు నాణ్యతగా ఉండాలి
కొండారెడ్డిపల్లి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- అధికారులతో సమీక్షించిన కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

బిజినేపల్లి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా, వేగంగా చేపట్టాలని కలెక్టర్‌ బదావ త్‌ సంతోష్‌ అన్నారు. ఆ గ్రామంలో జరుగుతు న్న అభివృద్ధి పనులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జీవీ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌, జిల్లా పరిషత్‌ సీఈవో, కొండారెడ్డిపల్లి అభివృద్ధి పనుల పరిశీల న ప్రత్యేక అధికారి దేవసహాయంతో కలెక్టర్‌ మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో స మీక్షా నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావే శంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా పరి షత్‌ సీఈవో దేవసహాయం, పీఆర్‌ ఈఈ విజయ్‌ కుమార్‌, డీపీఈ శ్రీరాములు, సీపీఓ సుజాత, వంగూర్‌ తహసీల్దా ర్‌ ఉన్నారు.

జనగణన తప్పుల్లేకుండా చేయాలి

నాగర్‌కర్నూల్‌ జిల్లా అభివృద్ధికి ఎంతో కీలక మైన జనాభా గణన తప్పుల్లేకుండా చేసేందుకు అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అధికారు లను అదేశించారు. దేశ చరిత్రలో తొలిసారి డిజి టల్‌ విధానంలో జనగణనను యజమాని స్వంతంగా తన మొబైల్‌ యాప్‌ ద్వారా చేసుకో వచ్చని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని ఏడీఓసీ సమావేశపు హాల్‌లో జిల్లా సెన్సస్‌ అధికారులకు ఈనెల 15 నుంచి 17 వరకు శిక్షణ నిర్వహించి ముగింపు సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. 16 భాషల్లో రూపొందిన పొర్టల్‌ ద్వారా యజమాని స్వంతంగా ఇంటి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆస్తులు వంటి పూర్తి ఆంశాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. మే 11న ప్రారంభమయ్యే జనాభా గనణలో జనగణన చేసే అధికారి ఆఇంటికి వెళ్ళి అడిగినప్పుడు ఎన్యూమరేషన్‌ చేసుకున్న ఐడీని తిరిగి తెరిచి వివరాలను సరిచూసుకొని ఫైనల్‌ సబ్మిట్‌ చేయాలన్నారు. రాష్ట్రస్థాయి నుంచి వచ్చిన జాయింట్‌ డైరెక్టర్‌ బలాజర్‌, మాస్టర్‌ ట్రైనర్‌ శివరామకృష్ణ, రాజేశ్వరి, టెక్నికల్‌ సపోర్ట్‌ టీమ్‌ సభ్యులు అధికారులకు జనగణన ప్రక్రి యపై పూర్తి అవగాహన కల్పించినట్లు తెలి పారు. కార్యక్రమంలో సీపీవో సుజాత, వివిధ శా ఖల అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు ఉన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 11:05 PM