మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:43 PM
చెన్నూరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నెంబర్ వన్ మున్సిపాలి టీలుగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకట స్వామి పేర్కొన్నారు. శుక్రవారం చెన్నూరు మున్సిపాలిటీలోని పలు వార్డు ల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
-రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి
చెన్నూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నెంబర్ వన్ మున్సిపాలి టీలుగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకట స్వామి పేర్కొన్నారు. శుక్రవారం చెన్నూరు మున్సిపాలిటీలోని పలు వార్డు ల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపాలిటీలో రూ. 15 కోట్లతోఅభి వృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి లోటు బడ్జెట్ ఉన్నా అభివృద్ధి పనులకు నిధులను విడుదల చేస్తున్నార న్నారు. చెన్నూరు మండలంలోని సోమనపల్లి గ్రామంలో రూ. 250 కోట్లతో ఇంటి గ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేవలం ఇసుక దందాలు చేశాడని, భూ మాఫియాను ప్రోత్సహించడం త ప్ప చేసిన అభివృధ్ధి శూన్యమన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం మోసి చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజక వ ర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన ఏకైక లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీ పక్ , అధికారులు, నాయకులు , ప్రజలు పాల్గొన్నారు.