అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:08 PM
రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్ట ర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.
- నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి
- బస్తీ దవాఖానలో ప్రజాపాలన కార్యక్రమం
నాగర్‌కర్నూల్ టౌన్, మార్చి 12 (ఆంధ్రజ్యో తి) : రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్ట ర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. ప్రజా పాలన- 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భా గంగా గురువారంజిల్లా కేంద్రంలోని 18వ వార్డు బస్తీ దవాఖానలో ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి పారిశు ధ్య పనులను ప్రారంభించారు. అనంతరం గర్భి ణులు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్తీ దవాఖానాలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నా యన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్ చం ద్రకళ, సునీత, కాంగ్రెస్ నా యకులు వంకేశ్వరం నిరం జన్, శ్రీనివాస్‌గౌడ్, గట్టు శ్రీ నివాసులు, హరీష్‌గౌడ్ పా ల్గొన్నారు.
గ్రామపంచాయతీ భవనం ప్రారంభం
తాడూరు, (ఆంధ్రజ్యోతి) : మండలంలోని నాగదేవ్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పం చా యతీ భవనాన్ని గురువారం ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతన పం చాయతీ భవనంలో సర్పంచ్ లక్ష్మమ్మను కుర్చీ లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా 20లక్షల రూ పాయలతో నిర్మించిన ఈ భవనం ఇక నుంచి అందుబాటు లోకి రానుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండల నాయకులు, పంచాయతీ రాజ్ సిబ్బం ది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. \