Share News

కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:38 PM

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరులోని క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ టీచ ర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సెల్‌ఫోన్‌లను పంపిణీ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

మంత్రి వివేక్‌

చెన్నూరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి) :కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరులోని క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ టీచ ర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సెల్‌ఫోన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌ వాడీ టీచర్లకు అందిస్తున్న సెల్‌ఫోన్‌లను సద్వినియోగం చేసుకుని విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ ప థకాలను అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తుం దన్నారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్మును వృధా చేసిందన్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ నేను తెచ్చిన నిధులతోనే అభివృద్ధి చేస్తున్నారని అంటు న్నాడని, మరి నిధులు ఉంటే అప్పుడే అభి వృద్ధి చెందుకు చేయలేదో ప్రజలకు చెప్పా లన్నారు. కేవలం సోషల్‌ మీడియాను అ డ్డుం పెట్టుకుని ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తూ బాల్క సుమన్‌ పబ్బం గడుపుకుంటున్నాడన్నారు.

ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడానికి జర్మనీ సంస్థ టామ్‌కామ్‌తో ఒప్పందం కు దుర్చుకున్నామన్నారు. యువకులు జర్మనీలో ఉపాధి పొందాలంటే మా కార్యాలయంలో రి జిస్ర్టేషన్‌ చేసుకుని ఉపాధి పొందాలన్నారు. అనంతరం 37 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదిముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 11:38 PM