Share News

kumaram bheem asifabad- కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Jun 24 , 2026 | 10:30 PM

కాంగ్రెస్‌ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరూపేదల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు

kumaram bheem asifabad- కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దండే విఠల్‌, మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు

కాగజ్‌నగర్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరూపేదల సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారిగా పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ఇందరిమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధి ప్రత్యేక కృషి చేస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ షాహిన్‌ సుల్తానాతోపాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో పలువురి చేరిక

సిర్పూరు(టి), జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి) మండలం లోనవెల్లి గ్రామ పంచాయతీలోని కోనేరు కాలనీకి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అన్నీ వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తోందన్నారు. అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారిగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పలువురు పాల్గొన్నారు. కాగా సిర్పూర్‌(టి) మండలం లోనవెల్లి గ్రామంలో బీరన్న బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్సీ దండె విఠల్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసం తోషాలతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం భక్తులకు బోనాలను సమర్పించి సంప్రదాయ నృత్యాలు, కోలాటాలను తిలకించారు.

Updated Date - Jun 24 , 2026 | 10:30 PM