Share News

kumaram bheem asifabad- కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Jan 18 , 2026 | 10:13 PM

కాంగ్రెస్‌ పాలనలోనే మారుమూల గ్రామాల అభివృద్ధి సాధ్య పడుతుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సగుణ అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా గెలుపొందిన జైనూర్‌, సిర్పూర్‌(యు) మండలాల సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆదివారం సన్మానించారు. అనంతరం కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ జై రాంజీకి పథకాన్ని వ్యతిరేకిస్తూ ముద్రించిన కర పత్రాలు విడుదల చేశారు.

kumaram bheem asifabad-  కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
నినాదాలు చేస్తున్న డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, కాంగ్రెస్‌ నాయకులు

జైనూర్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పాలనలోనే మారుమూల గ్రామాల అభివృద్ధి సాధ్య పడుతుందని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సగుణ అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా గెలుపొందిన జైనూర్‌, సిర్పూర్‌(యు) మండలాల సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆదివారం సన్మానించారు. అనంతరం కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ జై రాంజీకి పథకాన్ని వ్యతిరేకిస్తూ ముద్రించిన కర పత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వీబీజీని వ్యతిరేకిస్తూ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం సరికాదని చెప్పారు. దీంతో నిరుపేద కూలీలకు తీవ్రంగా నష్టం జరుగనుందని చెప్పారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. దీన్ని రద్దు చేయాలని సర్పంచ్‌లు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక తీర్మానాలు చేసి ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్‌షాకు పంపాలని ఆత్రం సుగుణ కోరారు. అనంతరం సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు కలిసి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణను శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్‌ పార్టీ జై అంటూ నినాదాలు చేశారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్‌ ముకీద్‌, ఆత్రం గోవింద్‌రావ్‌, సర్పంచ్‌లు కనక ప్రతిభ వెంకటేష్‌, ఆత్రం అయ్యుబాయి, రాథోడ్‌ రాందాస్‌, ఆత్రం జాలింషా, తొడ్సం రాజేందర్‌, నాయకులు షేక్‌ జమీల్‌, పెందుర్‌ లచ్చు, అజ్జులాల, మాజీ వైస్‌ ఎంపీపీలు చిర్లే లక్ష్మణ్‌, షేక్‌ రషీద్‌, వార్డు సభ్యులు రహీం ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి): వీబీరామ్‌ చట్టాన్ని తక్షణమే రద్దుచేయాలని డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ అన్నారు. మండలంలోని సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ పార్లీ కార్యకర్తలతో మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో మార్లవాయి సర్పంచ్‌ ప్రతిభవెంకటేష్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జాదవ్‌ లోకేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 10:13 PM