Share News

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Jan 02 , 2026 | 10:45 PM

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ సీనియర్‌ నాయకుడు ఆడెపు కుమారస్వామి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడలో పర్యటించారు. ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ సీనియర్‌ నాయకుడు ఆడెపు కుమారస్వామి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడలో పర్యటించారు. ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీ ఎ న్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. ప్రజల నుంచి సమస్యలపై సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా చున్నంబట్టివాడ కమాన్‌ నెంబర్‌ వన్‌ 40 ఫీ ట్ల రోడ్డు వెడల్పు చేసి నాలాల నిర్మాణం చేపట్టాలని కోరుతూ మున్సిపల్‌ కార్పోరేషన్‌ కమీషనర్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీ జేపీ నాయకులు రాంచందర్‌, సుజాత, చిరంజీవి, సుమన్‌ యాదవ్‌, బాపన్న, బాబు, శంకర్‌ సేన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 10:45 PM