Share News

చదువుతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:39 AM

చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

చదువుతోనే అభివృద్ధి సాధ్యం
సమావేశంలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి

బొట్టుగూడ పాఠశాల నిర్మాణం చిరకాల కోరిక

రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ టౌన్‌, జనవరి 27,(ఆంధ్రజ్యోతి): చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బొట్టుగూడ పాఠశాల నిర్మాణం తన చిరకాల కోరిక అని అన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.8కోట్లతో జిల్లాకేంద్రంలో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి వసతులు లేకుండా నిర్వహిస్తున్న బొట్టుగూడ పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించి, అధునాతన హంగులు కల్పించాలన్నది చిరకాల కోరిక అని అన్నారు. 2,500 గజాల స్థలంలో అన్ని అత్యాధునిక వసతులతో బొట్టుగూడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను నిర్మించినట్లు తెలిపారు. సంప్రదాయ విద్య కాకుండా అన్ని రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా ఈ పాఠశాలలో వాల్డాఫ్‌ విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. పాత సిలబ్‌సతో పాటు, సీబీఎ్‌సఈని కూడా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నా రు. సంప్రదాయ విద్య, ఎక్కువ మార్కులు, ర్యాంకుల చుట్టూనే తిరుగుతోంద ని, పిల్లలను ఆలోచించేందుకు కాకుండా కేవలం గుర్తుపెట్టుకుని పరీక్షలు రాయాలని ఒత్తిడి చేస్తోందన్నారు. అభివృద్ధిలో భాగంగా రూ.200 కోట్లతో ఔటర్‌ రిం గ్‌ రోడ్డు తీసుకొచ్చామని, రెండేళ్లలో నల్లగొండ రూపురేఖలను మారస్తామన్నారు. కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బొట్టుగూడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను రూ.8కోట్లతో అంతర్జాతీ య ప్రమాణాలతో ప్రతీక్‌ ఫౌండేషన్‌ ద్వారా మంత్రి ప్రత్యేక చొర వ తీసుకొని నిర్మించడం అభినందనీయమన్నారు. పాఠశాల ద్వారా బాధ్యతగల పౌరుడిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నా రు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు బొట్టుగూడ ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ దేశంలోనే బొట్టుగూడ లాంటి పాఠశాల ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌, ఆర్డీవో వై. అశోక్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు హఫీజ్‌ఖాన్‌, ప్రతీక ఫౌండేషన్‌ సీఈవో గోనారెడ్డి, డీఈవో బిక్షపతి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ శరతచంద్ర, మార్కెట్‌ చైర్మన్‌ జూకూరి రమేష్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమే్‌షగౌడ్‌, మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.

హెల్త్‌ ఏటీఎం, పైరమ్‌ టేర్‌ మిషన్‌, ఈసీజీ మిషన్‌ ప్రారంభం

జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.30లక్షలతో ఏర్పాటు చేసిన హెల్త్‌ ఏటీ ఎం, పైరమ్‌ టేర్‌ మిషన్‌, ఈసీజీ మిషన్‌ను మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ప్రారంభించా రు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచే ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ఖరీదైన ఆసుపత్రులకు వెళ్లకుండానే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ హెల్త్‌ ఎటిఎంలో ఈసీజీ, బీపీ, బ్లడ్‌ షుగర్‌, పల్స్‌, బాడీ టెంపరేచర్‌, ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ వంటి పరీక్షలు తక్కువ సమయంలో నిర్వహించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి కలెక్టర్‌ వై. అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:39 AM