ప్రతీ ఇంటి వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి
ABN , Publish Date - May 19 , 2026 | 11:16 PM
జన గ ణన నమోదు ప్రక్రియను పారదర్శకంగా నమో దు చేయాలని ఎన్యుమరేటర్లను కలెక్టర్ హేమం త కేశవ్ పాటిల్ ఆదేశించారు.
- సాతాపూర్‌లో పరిశీలించిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
పెద్దకొత్తపల్లి, మే 19 (ఆంధ్రజ్యోతి) : జన గ ణన నమోదు ప్రక్రియను పారదర్శకంగా నమో దు చేయాలని ఎన్యుమరేటర్లను కలెక్టర్ హేమం త కేశవ్ పాటిల్ ఆదేశించారు. జనగణన నమో దు సందర్భంగా ప్రతీ ఇంటి వివరాలు కచ్చితం గా నమోదు చేయాలని కలెక్టర్ సూచిం చారు. మండలంలోని సాతాపూర్ గ్రామంలో జరుగుతు న్న 2027 జనగణన ప్రక్రియను కలెక్టర్ మంగళ వారం పరిశీలించారు. సాతాపూర్ గ్రామంలో నల్ల శేఖర్ ఇంటి వద్ద ఎన్యురేటర్లు వివరాలు న మోదు చేస్తుండగా కలెక్టర్ ఆ ఇంటి కలెక్టర్ వెళ్లి వివరాలను సేకరిస్తున్న విధానాన్ని ప్రత్యక్షంగా గమనించారు. విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా ఐడెంటిటి కార్డులు ధరించి ప్రజల్లో విశ్వాసం కల్పించాలని, అలాగే గ్రామస్థు లు కూడా అధికారిక గుర్తింపు కార్డులు ఉన్న సి బ్బందికే తమ వివరాలు అందించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.శ్రీ నివాసులు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల అధికారులు, జనగణన సూపర్‌వైజర్లు, ఎన్యు మరేటర్లు పాల్గొన్నారు.
రైతులకు యూఎఫ్‌ఐడీ కీలకం
కోడేరు, (ఆంధ్రజ్యోతి) : రైతుల వివరాలను ఖచ్చితంగా డిజిటల్ నమోదు ప్రక్రి య వేగవం తం వేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్‌పా టిల్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ప సుపుల గ్రామంలో రైతుల విశిష్ట సంఖ్య నమో దు ప్రక్రియను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలిం చారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రైతు డిజిటల్ యాప్ ద్వారా కొనసాగుతున్న యూ నిక్ ఫార్మర్ ఐడెంటి ఫికేషన్ నెంబర్ (యూఎఫ్ ఐడీ) నమోదు కార్య క్రమాన్ని ఆయన పరిశీలిం చారు. ఆ గ్రామంలో భూమి వివరాలను నమో దు చేస్తున్న విధానాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లాలో మొత్తం 3,21,045 మం ది రైతులుండగా ఇప్పటి వరకు 2,18,890 మంది రైతుల వివరాలు మాత్రమే నమోదైనట్లు తెలిపారు. ఇంకా 120155 మంది రైతుల నమో దు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమం లో వ్యవసాయ అధికారులతో పాటు తహసీల్దా ర్ ఎండీ జెమిల్, రైతులు పాల్గొన్నారు.
పసుపులలో పర్యటన
మండల పరిధిలోని పసుపుల గ్రామంలో క లెక్టర్ హేమంత కేశ్ పాటిల్ పర్యటించారు. ప్ర జలు గ్రామ సమస్యలు ఆయనకు తెలిపారు. గ్రామంలోని పలు సమస్యలు గ్రామ సర్పంచు సుల్తానమ్మ, వార్డు మెంబర్లు గ్రామ సమస్యల ను కలెక్టర్ దృష్టికి తేగా త్వరలోనే సమస్యల పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఎండీ జమీల్, వ్యవసాయ అధికారులు, గ్రామ సర్పం చుతో పాటు గ్రామ పెద్దలు, డాక్టర్ గోపాలరావు, బొల్లె బాలసత్తయ్య, రమేశ్, పెద్ద నిరంజన్, బోయ నాగశేషి, తహసీల్దార్ వ్యవసాయ అధికా రులు పాల్గొన్నారు.