Share News

kumaram bheem asifabad-వివరాలు పక్కాగా నమోదు చేయాలి

ABN , Publish Date - Jul 03 , 2026 | 10:16 PM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్‌)లో ఓటర్లు వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ‘సర్‌’ సహాయత కేంద్రాన్ని ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. సర్‌ ఫారాలను నింపడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. లేనిచో ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు.

kumaram bheem asifabad-వివరాలు పక్కాగా నమోదు చేయాలి
బెజ్జూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ దండే విఠల్‌

బెజ్జూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్‌)లో ఓటర్లు వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ‘సర్‌’ సహాయత కేంద్రాన్ని ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. సర్‌ ఫారాలను నింపడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. లేనిచో ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇందుకోసం అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సహాయత కేంద్రాలను ప్రారంభించామని వివరించారు. 2002ఓటరు జాబితాలో ఉన్న పేర్లను మ్యాపింగ్‌ చేసుకోవాలని సూచించారు. పార్టీ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు బూత్‌ లెవల్‌ ఏజెంట్లను ఏర్పాటు చేశామని అన్నారు. బీఎల్‌వోల సహకారంతో ఎన్యూమరేటర్‌ ఫారాలను పూరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉండాలని కోరారు. ఓటు ప్రాథమిక హక్కు అని, ఓటు కోల్పోతే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు దూరమవుతామని అన్నారు. సర్‌కు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని, కేంద్రం అవలంబించే నిర్ణయాలకు వ్యతిరేకమని చెప్పారు. మన ఓటు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కోండ్ర జగ్గాగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్‌, సర్పంచులు సోయం చిన్నయ్య, రాంప్రసాద్‌, శంకర్‌, చిరంజీవి, శ్రీహరి, మల్లేష్‌, ఉపసర్పంచ్‌ ఆదర్శ్‌, నాయకులు పుష్పలత, శంకర్‌, సెండె శంకర్‌, సుగుణ, విశ్వేశ్వర్‌, రామకృష్ణ, సదాశివ్‌, రాజన్న, అబ్బాస్‌, బాబురావ్‌, సిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

పెంచికల్‌పేట, (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నేపథ్యంలో పెంచికల్‌పేట మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ను ఎమ్మెల్సీ దండె విఠల్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్ప్‌ డెస్క్‌ ద్వారా కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాల సవరణ, ఎన్యూమరేషన్‌ ఫారాలపై అవగాహన కల్పించనున్నామని చెప్పారు. ఓటరు జాబితాలో పేర్ల ధ్రువీకరణ వంటి సేవలు అందించనున్నట్లు తెలిపారు. హెల్ప్‌డెస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సముద్రాల సరిత, మాజీ సర్పంచ్‌ చంద్రమౌళి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాజన్న, కృష్ణ, శంకర్‌గౌడ్‌, సదాశివ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 10:16 PM