Share News

చెరువుల విధ్వంసం

ABN , Publish Date - May 19 , 2026 | 01:08 AM

రుద్రంగి మండ లంలో నీటి వనరుల సంరక్షణ కరువైంది. నీటి పారు దల శాఖ ఆధికారులు చెరువుల నిర్వహణ పట్టించు కోకపోవడంతో చెరువులలో మట్టి ఆక్రమంగా తవ్వుతు న్నారు. దనార్జనే ధ్యేయంగా మట్టి మాఫియా చెరు వులను విధ్వంసం చేస్తుంటే

చెరువుల విధ్వంసం
నల్లమట్టిని టిప్పర్‌లోకి లోడ్‌ చేస్తున్న ఎక్స్‌కావేటర్‌

రుద్రంగి, మే 18 (ఆంధ్రజ్యోతి) : రుద్రంగి మండ లంలో నీటి వనరుల సంరక్షణ కరువైంది. నీటి పారు దల శాఖ ఆధికారులు చెరువుల నిర్వహణ పట్టించు కోకపోవడంతో చెరువులలో మట్టి ఆక్రమంగా తవ్వుతు న్నారు. దనార్జనే ధ్యేయంగా మట్టి మాఫియా చెరు వులను విధ్వంసం చేస్తుంటే నిలువరించే నాథుడు కరువయ్యాడు. మట్టి తవ్వకాలను నియంత్రించాల్సిన ఇరిగేషన్‌, మైనింగ్‌ శాఖల ఆధికారులు పట్టించు కోక పోవడంతో చెరువులు రూపురేఖలు కోల్పోతున్నాయి.

రుద్రంగి మండలం మానాల గ్రామంలోని కొత్త చెరువు నుంచి నల్ల మట్టిని తవ్వి ఇటుక బట్టీలకు ఆక్రమంగా తరలిస్తున్నారు. జగిత్యాల పట్టణ శివా రులో ఇటుక బట్టీలకు, కథలాపూర్‌, కోరుట్ల పట్టాణా ల్లో ఇటుక బట్టీలకు చెరువుల్లోని మట్టి ఎక్స్‌కావేటర్ల ద్వారా ఇష్టారీతిన తవ్వి టిప్పర్లలో పట్టణాలకు తర లించి విక్రయిస్తున్నారు. మట్టి మాఫియా నాయకులు, అధికారుల అండదండలతో తవ్వకాలను యథేచ్ఛగా నిర్వహిస్తోందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఒక చెరువును గుర్తించి తవ్వకాలకు ముందే ము డుపులు చెల్లించేవారికి చెల్లించి ఒకటి, రెండు రోజు ల్లోనే చెరువులను అడ్డగోలుగా తవ్వేసి ధ్వంసం చేస్తు న్నారు. స్థానికంగా అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోందని చెబుతున్నారు.

నిబంధనలు నీటిపై రాతలే

నిబంధనల ప్రకారం చెరువుల్లో మట్టి తవ్వాలంటే ముందుగా ఆ చెరువులో నీటి నిల్వకు ఆటంకం లేకుం డా మట్టి అందుబాటులో ఉందని ఇరిగేషన్‌ డీఈ నేతృత్వంలోని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. అధికారుల సిఫారసు మేరకు మట్టి తవ్వేందుకు అవ కాశం ఉందని నిర్ధారిస్తే, సంబంధిత చెరువులో మట్టి తవ్వకానికి మెట్రిక్‌ టన్నుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మట్టి కొనుగోలుదారులు మైనింగ్‌ శాఖకు ముందుగానే చెల్లించి అనుమతులు పొందాలి. సెస్సు చెల్లించాక ఇచ్చే పర్మిట్ల మేరకు, నిర్దిష్టమైన కొలతల పరిధికి లోబడి మాత్రమే చెరువుల నుంచి మట్టిని తవ్వాల్సి ఉంది. అయితే మండలంలోని మానాల గ్రామంలోని కొత్త చెరువులో నిబంధనలేవీ అమలు చేయడం లేదు. ఇరిగేషన్‌ అధికారులెవరూ అందుబా టులో లేకపోవడంతో చెరువుల్లో అడ్డు అదుపులేని తవ్వకాలు జరుగుతున్నాయి. మానాల గ్రామం వెళ్లే దారిలో మానాల ఎక్స్‌రోడ్డు వద్ద పోలీస్‌ చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ పోలీస్‌ చెక్‌పోస్ట్‌ నుంచే వారం రోజులుగా మట్టి తరలింపు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మట్టి అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు

- పుష్పలత, తహశీల్ధార్‌, రుద్రంగి

నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. తమకు ఫిర్యాదు రావడంతో మండలంలోని మానాల గ్రామంలోని కొత్త చెరువును సందర్శించి, మట్టి తవ్వ కాలకు సంబంధించిన వాహనాలపై చర్యలు తీసు కోవాలని పోలిస్‌ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

Updated Date - May 19 , 2026 | 01:08 AM