Share News

అభివృద్ధి పేరుతో విధ్వంసం

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:48 PM

కళ్యాణిఖని మెగా ఉపరితల గనిలో పేలుతున్న బత్తి దెబ్బల వల్ల సమీప ప్రాంతాల గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు ఉం డడం లేదు. ప్రతి రోజు పేల్చే బత్తి దెబ్బలకు ఇళ్లు బీటలు వారుతుండగా మరికొన్ని నేల కూలుతున్నాయి.

అభివృద్ధి పేరుతో విధ్వంసం

కేకే ఓసీపీలో పేలుళ్లకు కూలుతున్న ఇళ్లు

-కాలుష్యం కోరల్లో సింగరేణి ప్రభావిత గ్రామాలు

-ఆందోళనలు, నిరసనలు బేఖాతరు

-ఇబ్బందుల్లో సమీప గ్రామాల ప్రజలు, పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

కాసిపేట, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : కళ్యాణిఖని మెగా ఉపరితల గనిలో పేలుతున్న బత్తి దెబ్బల వల్ల సమీప ప్రాంతాల గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు ఉం డడం లేదు. ప్రతి రోజు పేల్చే బత్తి దెబ్బలకు ఇళ్లు బీటలు వారుతుండగా మరికొన్ని నేల కూలుతున్నాయి. చిన్న పిల్ల లు, వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారు. కేకే ఓసీపీలో దుబ్బగూడెం గ్రామాన్ని మాత్రమే సింగరేణి ముంపు గ్రా మంగా ప్రకటించి పునరవాసం కల్పించింది. కానీ ఓసీపీకి దగ్గరగా ఉన్న సోమగూడెం, చొప్పరిపల్లె, ట్యాంకు బస్తీ, ఇందిరమ్మ కాలనీ, భరత్‌కాలనీ, గోండుగూడలతో పాటు మందమర్రి మండలంలోని ఎర్రగుంటపల్లె, యాపల్‌ గ్రా మాలన్నీ ఓసీపీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. గనిలో పే లే బత్తి దెబ్బలకు బండరాళ్లు ఎగిరి ఇళ్లపై పడడంతో స మీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నా రు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్‌ సేఫ్టీ, నేషనల్‌ గ్రీన్‌ ట్రి బ్యు నల్‌ (ఎన్‌జీటీ) ఇచ్చిన నివేదికలను తుంగలో తొక్కి సిం గరేణి యజమాన్యం ఇష్టారీతిన పేలుళ్లకు పాల్పడుతుంది. దీనిపై ప్రభావిత గ్రామాల బాధిత కుటుంబాలు ఓసీ పీని ముట్టడించి ఆందోళనలు చేసినా ఎవరు పట్టించుకో వడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-ఓసీపీ వల్ల కలిగే దుష్పరిణామాలు...

ఉపరితల గనిలో జరిగే బ్లాస్టింగ్‌, డంపర్లు తిరగడం వల్ల ధుమ్ము దూళితో పర్యావరణంపై తీవ్ర ప్రభావం ప డుతోంది. దీని వల్ల చుట్టు పక్కల 5 నుంచి 10 కిలోమీటర్ల మేర ఉన్న పంటలపై బూడిద, దుమ్ము పేరుకుపోయి రైతులు పంటలు నష్టపోతున్నారు.

-నీరు కలుషితం....

ఉపరిత గని కోసం భూగర్భ జలాలను బయటకు తోడే స్తారు. దీని వల్ల చుట్టు పక్కల ఉన్న బోర్లు, బావులు, వా గుల్లోని నీరు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపో తాయి. దీంతో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. అలాగే గని నుంచి వచ్చే వ్యర్థ జలాలు వాగుల్లో కలిసి నీరు కలుషితం అవుతుంది. విషపూరితమైన నీటిని తాగిన మూగజీవాలు, మనుషులు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతారు.

-జబ్బులు..

ఉపరితల గని నుంచి వెలువడే విష వాయువులను పీ ల్చడం వల్ల ఊపిరి తిత్తుల జబ్బులు, సిలికోసిస్‌ , అస్తమా, టీబీ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడడమే కా కుండా చర్మ , కంటి సమస్యలు తలెత్తుతాయి.

భూమిపై ఉన్న సారవంతమైన మట్టిని కోల్పోవడంతో సమీప భూములు వ్యవసాయానికి పనికి రాకుండా పోతా యి. రోజంతా బ్లాస్టింగ్‌, భారీ వాహనాల శబ్ధాలకు సమీప గ్రామాల ప్రజలు రాత్రి మెళకువతోనే కాలం గడపాల్సి వ స్తుంది. దీనిపై స్థానికులు ఆందోళనలు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభావిత గ్రామాల్లో మొక్కుబడిగా ప ర్యటిస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రజలు వాపోతున్నారు. మెరుగైన వసతులు కల్పించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

-నిబంధనలకు నీళ్లు...

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ ) ఇచ్చిన నివేదికతో పాటు 2020లో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) తీర్పు ఆధారంగా నివాస గృహాలు, ప్రభుత్వ భ వనాలు, పాఠశాలలు, ఆసుపత్రి, హైవే రోడ్లు, రైల్వే లైన్‌లు, నదులు, చెరువులకు దూరంగానే ఉపరితల గనులను కొనసాగించాలి. కానీ కళ్యాణిఖని మెగా ఓసీపీ గ్రామాలకు 500 మీటర్ల లోపునే ఓసీపీ యజమాన్యం కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దీని వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడు తున్నారు. ఇది వరకే చొప్పరిపల్లెలో ప్రభుత్వ బడి మూత పడింది. కేకే ఓసీపీ నుంచి రోజుకు 8 వేల నుంచి 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. అలాగే ఏడాదికి 2.5 మెట్రిక్‌ టన్నుల బొగ్గును వెలికి తీస్తున్నట్లు అంచనా. సిం గరేణి యజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధను ప్రభావి త గ్రామాలపై చూపించకపోవడంతో బాధిత గ్రామాల ప్ర జలు ఆందోళనలు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను కా పాడుతూ నిబంధనలు పాటిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే జీవ వైవిధ్యం దెబ్బతిని మానవ మనుగడే ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని పర్యా వరణ వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

మౌలిక సదుపాయాలు కల్పించాలి

రాంచందర్‌, ప్రభావిత గ్రామాల సమన్వయ కమిటీ సభ్యుడు , చొప్పరిపల్లె 24కేసీపీటీ31

కళ్యాణి ఖని మెగా ఓసీపీ వల్ల నష్టపోతున్న గ్రామా లను గుర్తించి అన్ని గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి. బ్లాస్టింగ్‌ వల్ల నష్టపోయిన ఇళ్లకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ప్రబావిత గ్రామాల్లో సింగరేణి ఉచిత విద్య, వైద్యం కల్పించాలి. అలాగే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలి. అర్హులైన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పర్చి ఉద్యోగాలు కల్పించాలి.

బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తాం

రాధాకృష్ణ, సింగరేణి జీఎం, మందమర్రి ఏరియా 25కేసీపీటీ31

ఓసీపీ ప్రభావిత గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుం బాలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అ లాగే బ్లాస్టింగ్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞా నాన్ని వాడుతున్నాం. బ్లాస్టింగ్‌ తీవ్రతను పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల మేరకు బ్లాస్టిం గ్‌ కొనసాగుతుంది. దుబ్బగూడెం ముంపు గ్రామానికి పునరావాస కాలనీని నిర్మిస్తున్నాం. సింగరేణి ప్రభావిత గ్రా మాల్లో మెరుగైన వసతులు కల్పించి వైద్య శిబిరాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Aug 31 , 2026 | 11:48 PM